బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్స్ (JA) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది.
దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.ఆసక్తితో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు ఎస్బిఐ అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేసుకోవచ్చు. నేటి నుంచి అంటే డిసెంబర్ 17వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ప్రక్రియ:
నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు డిసెంబర్ 17 నుండి ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోగలరు. 7జనవరి 2025 దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీ వివరాలు:
SBI JA నోటిఫికేషన్ 2024 ప్రకారం, 13,735 పోస్టులు రిక్రూట్ చేయనున్నారు.
అర్హతలు:
* గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించిన ఏదైనా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా IDD ఉత్తీర్ణత తేదీ డిసెంబర్ 31, 2024 లేదా అంతకు ముందు ఉండేలా చూసుకోవాలి.
* గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం లేదా సెమిస్టర్‌లో ఉన్నవారు కూడా గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రుజువును 31 డిసెంబర్ 2024న లేదా అంతకు ముందు సమర్పించాలి అనే షరతుకు లోబడి తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
*వయోపరిమితి ప్రమాణాల ప్రకారం, ఏప్రిల్ 1, 2024 నాటికి అభ్యర్థి వయస్సు 20 సంవత్సరాల కంటే తక్కువ, 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు, అభ్యర్థి ఏప్రిల్ 2, 1996కి ముందు, ఏప్రిల్ 1, 2004 తర్వాత జన్మించి ఉండకూడదు.
*సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
దరఖాస్తు రుసుము ఎంత చెల్లించాలి?
*ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాలి. దరఖాస్తు చేయడానికి, జనరల్, ఇతర వెనుకబడిన తరగతి (OBC) ఆర్థికంగా వెనుకబడిన విభాగం (EWS) దరఖాస్తుదారులు రూ. 750 చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించకుండా మినహాయింపు ఇచ్చారు.