కష్టంగా EMI చెల్లించే వారికి.. గుడ్ న్యూస్.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది బ్యాంక్ EMI లతో పోరాడుతున్నారు. తక్కువ వడ్డీకి.. ఇలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా లోన్ ఇస్తామని బ్యాంకులతోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఆఫర్లు చేస్తుంటాయి.


వ్యాపారులకు టెంప్ట్ అయినా చాలామంది ఇప్పటికే రుణాలు తీసుకున్నారు. అవసరం ఉన్నవారు.. లేనివారు.. సరదా కోసం.. జల్సా కోసం రుణాలు తీసుకున్నారు. అయితే లోన్ ఏదైనా తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ నెల నెల ఈఎంఐ చెల్లించేటప్పుడు దుఃఖ వస్తుంది. అయితే కొందరు భయపడి.. మరికొందరు తిండి తిప్పలు లేకుండా ఈఎంఐ లను రెగ్యులర్గా పే చేస్తారు. కానీ ఒక్కోసారి కష్ట పరిస్థితులు వస్తాయి. ఇలాంటి అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ ఎం ఐ భారాన్ని తగ్గించుకొనే కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రీ షెడ్యూల్:
వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది పర్సనల్ లోన్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సంస్థలు తక్కువ వడ్డీకి.. వితౌట్ డాక్యుమెంటేషన్ అంటూ ప్రకటనలు చేయడంతో ప్రభావితమైన చాలామంది ఈ లోన్లను తీసుకుంటారు. అయితే వారు చెప్పిన విధంగా తక్కువ వడ్డీ కాకుండా ఆ తర్వాత అదనపు వడ్డీలు వేస్తుంటారు. కొన్ని బ్యాంకులు అయితే ప్రాసెసింగ్ ఫీజులు కూడా విధిస్తారు. ఇలా ఆర్థిక భారం ఏర్పడి ఈఎంఐ చెల్లించలేని పక్షంలో రీ షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి తమ లోను రీ షెడ్యూల్ చేయాలని కోరవచ్చు. అంటే ఇప్పటివరకు ఉన్న ఈఎంఐ ని 50% తగ్గించాలని.. టెన్యూర్ పొడిగించాలని రిక్వెస్ట్ చేయవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం ఈఎంఐ 10000 ఉంటే 5000 కు మార్చమని అడిగితే వారు ఖచ్చితంగా రీ షెడ్యూల్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో తాత్కాలికంగా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు.

తక్కువ వడ్డీ లోన్:
ఇప్పటివరకు లోన్ తీసుకున్న మొత్తానికి వడ్డీ రేటు ఎక్కువ అని అనిపిస్తే.. తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులను సంప్రదించాలి. వివిధ గ్రామాల్లో గాని.. తెలిసిన వారిని గాని ఈ విషయాన్ని అడిగితే కచ్చితంగా చెబుతారు. తద్వారా తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఎక్కువ వడ్డీ ఉండే బ్యాంకుకు చెల్లించడం ద్వారా కొంతవరకు ఆర్థికంగా వెసులుబాటు అవుతుంది. అంతేకాకుండా కొత్త బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో కూడా లోన్ తీసుకోవచ్చు.

వన్ టైం సెటిల్మెంట్:
నెలనెలా ఈఎంఐ చెల్లించలేము అని అనుకున్న పక్షంలో.. వన్ టైం సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఒక లక్ష రూపాయల రుణం ఉందని అనుకుందాం.. దీనిపై ప్రతినెల 5000 చెల్లించాల్సి వస్తే.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నవారు.. లోన్ మొత్తాన్ని వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలి. అయితే సాధారణంగా వన్ టైం సెటిల్మెంట్ కు ప్రీ క్లోజెస్ చార్జెస్ వేస్తారు. అయితే బ్యాంకును నేరుగా సంప్రదించి రిక్వెస్ట్ చేస్తే.. ఇందులో తగ్గించే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు ఆ విషయం కూడా బ్యాంకు వారికి చెబితే వారు నమ్మే అవకాశం కూడా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.