తమిళనాడు జిల్లాలోని వేళాంకణిలో ఉన్న చర్చికి ఉన్న చారిత్రక నేపథ్యంలో ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశనలుమూలల నుంచి ఈ ప్రాంతానికి ప్రతీ ఏటా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.
ప్రతీ ఏటా ఆగస్టు చివరి వారంలో వేలంకన్ని చర్చి వార్షిక వేడుకలు పెద్దగా భక్తులు వస్తుంటారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రదేశాల నుంచి చర్చిని సందర్శించుకునేందుకు వస్తుంటారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సికింద్రాబాద్-వేళాంకణి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* సికింద్రాబాద్-వేళాంకణిల మధ్య ట్రైన్ నెంబర్ 07125 ఉదయం 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు వేళాంకణి చేరుకుంటుంది. ఈ రైలు 27-08-2024, 04-09-2024 తేదీల్లో బయలుదేరుతుంది.
* వేళాంకణి-సికింద్రాబాద్‌ల మధ్య ట్రైన్ నెంబర్ 07126 రైలు 22.45 గంటలకు బయలు దేరు తర్వాతి రోజు 3.00 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు 28-08-2024, 05-09-2024 తేదీల్లో నడుస్తుంది.
* సికింద్రాబాద్-వేళాంకణిల మధ్య ట్రైన్ నెంబర్ 07127 రైలు.. 8.25 గంటలకు బయలుదేరి తర్వతి రోజు 9.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు 29-08-2024, 07-09-2024 రోజుల్లో నడుస్తుంది.
* వేళాంకణి-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే ట్రైన్ నెంబర్ 07128 22.45 గంటలకు బయలు దేరి, తర్వాతి రోజు 3 గంటలకు చేరుకుంటుంది. 30-08-24, 08-09-2024 తేదీల్లో బయలు దేరుతుంది.
ఈ రైల్లు నాల్గొండ, మిర్యాలగూడ, నదికుడే, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావల, నెల్లూరు, గూడురు, రేణిగుంట, కాట్పడి, వేలూరు, తిరువమల్లాయ్, విల్లుపురం, చిదంబరం, సర్‌ఖాజీ, మయిలదుతుది, తిరువరుర్, నగగపట్టణం స్టేషన్స్‌లో ఆగుతుంది.