మహిళలకు శుభవార్త.. దిగొచ్చిన పసిడి ధరలు.. ఇప్పుడు కొంటే బెటర్

www.mannamweb.com


ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్లు భారీ స్థాయిలో పెరుగుతూ వచ్చాయి. గత నెల పార్లమెంట్ లో బడ్జెట్ సమయంలో కేంద్రం బంగారం, వెండి పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించగా మరుసటి రోజు నుంచి వారం పాటు రూ.7 వేల వరకు తగ్గుతూ వచ్చింది. వారం రోజుల్లోనే మళ్లీ పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడిపోయారు. అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చితి నేలకొడంతో పసిడి, వెండి ధరలు ఎతబాగుతున్నాయని నిపుణులు అంటున్నారు. డాలర్ పడిపోతుండటం కూడా దీనికి ఒక రకంగా ఊతమిస్తుందని అంటున్నారు. వరుసగా రెండు వారాలుగా పెరిగిన పసిడి ధరల అంతర్జాతీయ మార్కెట్ లో గరిష్ట స్థాయికి దిగివచ్చంది. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. శ్రావణ మాసం సందర్భంగా పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సందడి మొదలైంది. సాధారణంగా ఈ సీజన్ లో చాలా వరకు మహిళలు పసిడి కొనుగోలు చేస్తుంటారు. బంగారం మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. ఒకప్పుడు బంగారం అనగానే ఆభరణాలుగా మాత్రమే చూసేవారు.. కానీ ఇప్పుడు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పుత్తడి మంచి సాధనంగామారింది. పసిడితో పాటు ఇప్పుడు వెండికి కూడా మంచి గిరాకీ ఉంది. ఇటీవల వీటి డిమాండ్ భారీగా పెరిగిపోవడంతో తరుచూ ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి.22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.10 తగ్గి, రూ.66,590కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.10 తగ్గి, రూ.72,640 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన

హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,590 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,640 వద్ద కొనసాగుతుంది.

today gold rate

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,740 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,790 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,590 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,640 వద్ద కొనసాగుతుంది. ముంబై,బెంగుళూరు, కోల్ కొతా, కేరళా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,590 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,640 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి పై రూ.100 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 91,600, ముంబై,కోల్‌కొతా, కేరళా లో కిలో వెండి ధర రూ. 81,900 వద్ద కొనసాగుతుంది.