మహిళలకు గుడ్‌న్యూస్.. బంగారం కొనేందుకు ఇదే కరెక్ట్ టైమ్

www.mannamweb.com


బంగారాన్ని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందునా మహిళలు అయితే చెప్పనక్కర్లేదు. పసిడి అంటే స్త్రీలకు చాలా ఇష్టం.

మన దేశంలో గోల్డ్‌ను ఆభరణంగానే గాక ఇన్వెస్ట్‌మెంట్‌గానూ చూస్తారు. ఏదైనా అత్యవసరం ఉంటే బంగారాన్ని తనఖా పెట్టొచ్చని భావిస్తారు. అందుకే ఇదో పెట్టుబడిగా మారింది. డబ్బులు ఉంటే గోల్డ్ కొని పక్కన పెట్టడం చాలా మందికి అలవాటు. దీన్ని స్టేటస్ సింబల్‌గానూ చూస్తుంటారు. కాబట్టి ఎంత గోల్డ్ ఉంటే అంత తోపు అనే భావన కూడా ఎక్కువ మందిలో ఉంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న బంగారం ధరలు ఇవాళ ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం..

తులం ఎంతంటే..

ఈ మధ్య బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ సోమవారం కూడా గోల్డ్ రేట్స్ తగ్గాయి. బంగారం 10 గ్రాములకు సుమారుగా రూ.600 తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 77,649 పలుకుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర చూసుకుంటే రూ.71,179గా ఉంది. వెండి విషయానికొస్తే.. కేజీ సిల్వర్ రేట్ రూ.1,03,300 పలుకుతోంది. ఇక, బంగారం ధరలు ఈ మధ్య భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ నెలలో గరిష్ట స్థాయిలో తులం రూ.84 వేల వరకు వెళ్లినా.. ఆ తర్వాత క్రమంగా పడిపోతూ వచ్చింది.

ఇదే బెస్ట్ టైమ్

నవంబర్ నెలలోని ఆల్‌టైమ్ హైతో పోల్చి చూస్తే ఇప్పుడు రూ.77 వేల వరకు వచ్చేసింది బంగారం. గత నెలతో పోలిస్తే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. నెల రోజుల వ్యవధిలో దాదాపుగా రూ.7 వేల మేర రేటు తగ్గడం మామూలు విషయం కాదు. అందుకే గోల్డ్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్ అని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాల వల్లే బంగారం ధరల్లో భారీ మార్పు వస్తోందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. యూఎస్‌లో డాలర్ బలపడే కొద్దీ గోల్డ్ రేట్ తగ్గుతుందని చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అక్కడి ఇన్వెస్టర్లు బంగారం మీద పెట్టుబడులు తగ్గించుకుంటున్నారని అంటున్నారు. గోల్డ్ నుంచి స్టాక్ మార్కెట్‌లో లాభాలు ఎక్కువగా ఉండటంతో అటు వైపు షిఫ్ట్ అవుతున్నారని అంచనా వేస్తున్నారు.