Union Budget 2024: ప్రజలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఒక్కో కుటుంబానికి నేరుగా రూ. 10 లక్షలు..!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ (బడ్జెట్ 2024)ను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీనికోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. సామాన్యులకు పూర్తి స్థాయిలో పథకాలు అందేలా.. దీంతోపాటు ఇప్పటికే ఉన్న పథకాలకు సంబంధించి బడ్జెట్ పెంచేలా కసరత్తులు చేస్తోంది..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ (బడ్జెట్ 2024)ను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీనికోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. సామాన్యులకు పూర్తి స్థాయిలో పథకాలు అందేలా.. దీంతోపాటు ఇప్పటికే ఉన్న పథకాలకు సంబంధించి బడ్జెట్ పెంచేలా కసరత్తులు చేస్తోంది.. ఈసారి దేశంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రజాకర్షక బడ్జెట్ ను ప్రవేశపెడుతుందని ప్రజలు భావిస్తున్నారు. 2024-25 రాబోయే బడ్జెట్ లో సామాన్యులకు ఊరట కలిగించేలా కేంద్రం కీలక అంశాలతో పూర్తి స్థాయిలో బడ్జెట్ ను రూపొందించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ముఖ్యంగా సామాన్యుల ఆదాయ పన్ను పరిమితితో పాటు.. సంక్షేమ, ఆరోగ్య సంరక్షణకు విషయంలో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించనున్నట్లు పేర్కొంటున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY), ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయవచ్చని భావిస్తున్నారు. 2024 బడ్జెట్‌లో ఆయుష్మాన్ భారత్-పీఎంజేఏవై పథకం కింద అందుబాటులో ఉన్న ఆరోగ్య బీమా కవరేజీని రెట్టింపు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
నివేదిక ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన లబ్ధిదారుల సంఖ్య, బీమా మొత్తం రెండింటినీ పెంచడాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే కవరేజీ పరిమితిని ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. రాబోయే మూడేళ్లలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆలోచిస్తోంది.
కవరేజ్ ప్రతిపాదనను ఖరారు చేసేందుకు సన్నాహాలు: రాబోయే మూడేళ్లలో AB-PMJAY కింద లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే, దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందికి పైగా ఆరోగ్య భద్రతను పొందగలుగుతారు. కుటుంబాలు అప్పుల ఊబిలోకి నెట్టే విషయాల్లో వైద్యం కోసం భారీగా ఖర్చు చేయడం కూడా ఒక ప్రధాన కారణమని ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందని నివేదికలోని వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ యోజన కవరేజీ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే ప్రతిపాదనను కూడా ఖరారు చేసేందుకు ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోందని తెలుస్తోంది..
ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ ప్రతిపాదనలు లేదా వాటిలోని అంశాలను ఈ బడ్జెట్‌లో ప్రకటించాలని భావిస్తున్నారు. నివేదిక ప్రకారం, ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందినట్లయితే, జాతీయ ఆరోగ్య అథారిటీ రూపొందించిన అంచనాల ప్రకారం, ప్రభుత్వ ఖజానాపై ప్రతి సంవత్సరం రూ.12,076 కోట్ల అదనపు భారం పడుతుంది. కొత్తగా 70 ఏళ్లు పైబడిన వారితో సహా, దాదాపు 4-5 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధిపొందుతారని పేర్కొంటున్నారు.
ఆయుష్మాన్ భారత్-PMJAY కోసం 2018 సంవత్సరంలో రూ. 5 లక్షల పరిమితిని నిర్ణయించింది.. ఇప్పుడు, ద్రవ్యోల్బణం, మార్పిడితో సహా ఇతర ఖరీదైన చికిత్సల విషయంలో కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి, ఈ పథకం కింద అందుబాటులో ఉన్న కవరేజీ పరిమితిని రెట్టింపు చేయాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ కూడా ఆయుష్మాన్ పథకం కింద వర్తిస్తుందని, వారికి ఉచిత చికిత్స సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. దీంతో ఖరీదైన చికిత్స నుండి ప్రజలకు ఉపశమనం లభించనుంది. ఇప్పటికే.. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 13.5 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి.. 32.4 కోట్ల మందికి కార్డులు ఉన్నాయి.