UPI సర్కిల్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేసిన Google pay.. Bank అకౌంట్ లేకున్నా పేమెంట్ చేయొచ్చు

www.mannamweb.com


ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పేకు కోట్లాది మంది యూజర్లున్నారు. నిత్యం వేలాది ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న అందరి వద్ద గూగుల్ పే యాప్ ఉందనడంలో సందేహం లేదు. తాజాగా గూగుల్ పే యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించిన యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని గూగుల్ పే ప్రారంభించింది. ఈ ఫీచర్ తో యూపీఐని ఇతరులతో పంచుకోవచ్చు. అంటే ఇతర వ్యక్తులు తమకు బ్యాంక్ అకౌంట్ లేకున్నా కూడా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. గూగుల్ పే తీసుకొచ్చిన ఈ ఫీచర్ తో కుటుంబ సభ్యులు, స్నేహితులు బ్యాంక్ ఖాతా లేకున్నా యూపీఐ అకౌంట్‌ను వాడుకోవచ్చు.

గూగుల్ పే ద్వారా ఓన్ యూపీఐ అకౌంట్ ఉన్న వారు మాత్రమే పేమెంట్ చేసే సదుపాయం ఉంది. ఎవరి యూపీఐని వారే వాడుకోవాలి. వేరొకరు వాడేందుకు అనుమతి లేదు. యూపీఐ సర్కిల్ ఫీచర్ తో యూపీఐ అకౌంట్ ను వేరే వ్యక్తులకు కూడా ఇవ్వొచ్చు. యూపీఐ సర్కిల్ కోసం గూగుల్‌ పే ఎన్‌పీసీఐతో జట్టు కట్టింది. ఈ సదుపాయం ద్వారా ఇతరులకు పాక్షికంగా లేదా పూర్తి డెలిగేషన్‌ ఇవ్వొచ్చు. ప్రైమరీ యూపీఐ అకౌంట్‌ను కుటుంబ సభ్యులు, పరిచయం ఉన్న వ్యక్తులతో పంచుకునే వెసులుబాటును కల్పిస్తోంది. అంటే ఒకరి బ్యాంక్‌ అకౌంట్‌ను వేరొకరు వినియోగించి ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. యూపీఐ సర్కిల్ ఫీచర్ తో గరిష్ఠంగా ఐదుగురితో యూపీఐ అకౌంట్ ను పంచుకోవచ్చు.

మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ పేమెంట్స్ విషయంలో కీలక మార్పులు చేయబోతోంది. ఇకపై పిన్ లేకుండానే చెల్లింపులు చేయొచ్చు. పిన్ కు బదులుగా బయోమెట్రిక్ ధృవీకరణను తీసుకురానుంది. ఈ కొత్త విధానంలో యూపీఐ చెల్లింపులను వేలి ముద్ర లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ విధానంలో యూపీఐ పేమెంట్స్ మరింత సురక్షితంగా ఉండనున్నది.