కొత్త పిక్సెల్ ఫోన్ కావాలా? అతి త్వరలో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ కాబోతుంది. మొత్తం 3 మోడళ్లు రానున్నాయి. అంతకన్నా ముందే ఈ ఫిక్సెల్ సిరీస్ ఫీచర్లు, ధర, లాంచ్ తేదీ వివరాలు లీక్ అయ్యాయి.
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మరో సరికొత్త పిక్సెల్ ఫోన్ తీసుకొస్తోంది. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ త్వరలో లాంచ్ చేయనుంది. అయితే, లాంచ్‌కు ముందే ఈ పిక్సెల్ 10 ఫోన్ ఫీచర్లు, ధర, లాంచ్ టైమ్ లైన్ అన్ని వివరాలు లీక్ అయ్యాయి.
ఇటీవలే పిక్సెల్ 9a లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌ను మరింత విస్తరించింది. నివేదికల ప్రకారం.. టెక్ దిగ్గజం పిక్సెల్ 10 సిరీస్‌పై వర్క్ చేస్తోంది. అధికారిక లాంచ్‌కు ఇంకా నెలల సమయం ఉంది. ఇంతలోనే లీక్‌లు, పుకార్లు వస్తున్నాయి.
డిస్కౌంట్లు.. చౌకైన ధరకే ఇలా పొందొచ్చు!
గూగుల్ రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఏయే ఫీచర్లు ఉండొచ్చు అనేది పిక్సెల్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. గూగుల్ పిక్సెల్ 10 లైనప్‌లో మొత్తం 3 మోడళ్లు పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL ఉంటాయని భావిస్తున్నారు.
గూగుల్ పిక్సెల్ 10 డిజైన్, స్పెసిఫికేషన్లు (అంచనా) :
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ డిజైన్‌ను మార్చే అవకాశం ఉందని పుకార్లు ఉన్నాయి. అయితే, సిగ్నేచర్ పిక్సెల్ లుక్‌ను అలానే ఉంచే అవకాశం ఉంది. పిక్సెల్ 10 ప్రో XL మునుపటి వెర్షన్ కన్నా కొంచెం కాంపాక్ట్‌గా ఉంటుందని లీక్ డేటా చెబుతోంది.
ఫోన్ కొలతలు (162.7 x 76.6 x 8.5mm)గా ఉండొచ్చు. అయితే, ఇప్పటికీ భారీ 6.8-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ప్రో వెర్షన్‌లు ఫ్రేమ్‌లతో రావచ్చు. అలాగే, స్టాండర్డ్ పిక్సెల్ 10 మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉండొచ్చు.
అన్ని పిక్సెల్ 10 మోడల్‌లు గూగుల్ నెక్స్ట్ జనరేషన్ టెన్సర్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతాయని భావిస్తున్నారు. ఈ కొత్త చిప్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, ఏఐ ఫీచర్లతో అప్‌గ్రేడ్ అందించనుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్లు కెమెరా క్వాలిటీకి బెస్ట్ అని చెప్పవచ్చు.
ఈసారి, గూగుల్ కొన్ని మెయిన్ అప్‌గ్రేడ్‌లతో రావొచ్చు. మొదటిసారిగా, బేస్ పిక్సెల్ 10 మోడల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని పుకారు ఉంది. ఇందులో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండవచ్చు. గతంలో ప్రో మోడళ్లకే పరిమితమయ్యాయి.
గూగుల్ పిక్సెల్ 10 ధర, లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
గూగుల్ స్టాండర్డ్ పిక్సెల్ 10 ధర దాదాపు రూ.70వేలు ఉంటుందని అంచనా. గూగుల్ ప్రో మోడల్స్ ధర రూ.లక్ష కన్నా ఎక్కువగా ఉండవచ్చు. లాంచ్ తేదీ విషయానికొస్తే.. గూగుల్ సాధారణంగా కొత్త పిక్సెల్ ఫోన్‌లను అక్టోబర్‌లో రిలీజ్ చేస్తుంది. పిక్సెల్ 10 సిరీస్ కూడా ఈ ఏడాది దాదాపు అదే సమయంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.