గూగుల్ పిక్సెల్ 9 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్చ్..! మెంటలెక్కిస్తున్న నయా ఫీచర్లు

www.mannamweb.com


భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం భారీస్థాయిలో ఉంది. అయితే బడ్జెట్ ఫోన్స్‌తో పాటు ప్రీమియం ఫోన్స్ వాడే వారి సంఖ్య ప్రస్తతం బాగా పెరుగుతుంది.

ఈ నేపథ్యంలో టాప్ కంపెనీలు తమ ప్రీమియం ఫోన్స్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోన్స్‌కు సంబంధించి ఆ సంస్థ క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చింది. ఆగస్టు 13న నిర్వహించే గూగుల్ ఈవెంట్లో ఈ స్మార్ట్ ఫోన్స్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఎక్స్‌లో ప్రకటించింది. ఈ మేరకు ఈ రెండు ఫోన్లకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది. అయితే గూగుల్ అధికారికంగా ఈ రెండు ఫోన్స్‌కు సంబంధించిన ఫీచర్స్ పేర్కొనకపోయినా లీకు వీరులు మాత్రం ఫీచర్స్‌ ఇవేనంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్‌గా గూగుల్ నయా ఫోన్స్ ఫీచర్స్ గురించి వివరాలను తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్

ఈ ఫోన్ డ్యూయల్ పిల్ షేమ్ కెమెరా కటౌట్‌లతో అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. అలాగే కెమెరాలు వెనుక ప్యానెల్‌కు సంబంధించిన రెక్ట్‌యాంగులర్ షేప్‌లో ఇచ్చారు. అలాగే ఈ ఫోన్‌కు ఎడమ వైపున పంచ్ హోల్ కెమెరాను కలిగి ఉంటుందని పుకార్లు షికారు చేస్తున్నారు. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ అబ్సిడియన్, పింగాణీ రంగు ఎంపికలలో అందుబాటులో ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ 256 జీబీ వేరియంట్ ధర సుమారు రూ. 1,68,900గా ఉంటుందని, అలాగే 512 జీబీ వేరియంట్ ధర సుమారు సుమారు రూ. 1,80,500 ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో

గూగుల్ పిక్సెల్ 8 ప్రో మాదిరిగానే గూగుల్ 9 ప్రో ఉందని టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరాలు, ఫ్లాష్, లేజర్ ఆటోఫోకస్‌తో కూడిన చిన్న కెమెరా డెకోతో వస్తుంది. అయితే నివేదికల ప్రకారం పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్స్‌లో కూడా ట్రిపుల్ 50 ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్‌తో వస్తాయి. అయితే ఈ రెండు ఫోన్లకు స్క్రీన్ పరిమాణంతో బ్యాటరీ సామర్థ్యంలో తేడా ఉంటుంది. పిక్సెల్ 9 ప్రో అబ్సిడియన్, పింగాణీ, హాజెల్ (సేజ్ గ్రీన్), పింక్ నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్టోరేజ్ ఆప్షన్‌లు, వాటి అంచనా ధరలను చూస్తే 128 జీబీ రూ. 97,500, 256 జీబీ రూ. 1,06,400, 256 జీబీ రూ. 1,18,000గా ఉండవచ్చని నిపుణుల అంచనా. ఆగస్ట్ 13న గూగుల్ హార్డ్‌వేర్ ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ వాచ్-3ను లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.