‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కో విప్లవ వీరుడై విజృభించి బ్రిటీషు సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తాడు.
సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర్య నినాదం’ అంటూ అల్లూరి సీతరామరాజు లో కృష్ణ చెప్పిన డైలాగ్‌తో గూస్బంప్స్ వస్తాయి.
‘ఒరేయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు.. నారు పోసావా నీరు పెట్టావా.. కోత కొసావా కుప్ప నూర్చవా.. ఒరేయ్ తెల్ల కుక్కా కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు సిస్తేన్దుకు కట్టాలిరా’ అంటూ వీరపాండియ కట్టబొమ్మన్ పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్బంప్స్ తెప్పించింది.
దేశం కోసం ప్రాణాలిచ్చిన అల్లూరి, భగత్‌సింగ్‌లను తెల్లదొరలు చంపారు. నన్ను చంపితే సాటి భారతీయుడిని చంపిన మొదటి జాతి ద్రోహివి నువ్వే అవుతావ్. చంపరా.. చంపు’ అని సుభాష్ చంద్రబోస్‌లో వెంకటేష్ చెప్పిన డైలాగ్ సూపర్.
సైరా నరసింహారెడ్డి లో మెగాస్టార్ చిరంజీవి ‘స్వేచ్చా కోసం ప్రజలు చేస్తున్న తిరిగుబాటు… నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్న.. నాదేశం వదిలి వెళ్ళిపోండి… లేదా యుద్దమే’ అంటూ డైలాగ్‌తో అదరగొట్టారు.
‘నువ్వు చేసేది ధర్మయుద్ధమైతే.. ఆ యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి’ అంటూ ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్‌కు థియేటర్ విజిల్స్‌తో దద్దరిల్లింది.
‘తొంగి తొంగి నక్కి నక్కి కాదే… తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి’ అంటూ ఆర్ఆర్ఆర్లో డైలాగ్‌తో అదరగొట్టారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీనికి థియేటర్ మొత్తం షాక్ అయిందనే చెప్పాలి.
‘మీరెవరో మాకు తెలియదు..మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు..కాని మీకోసం, మీ పిల్లల కోసం, పగలు రాత్రి, యెండ, వానని లేకుండా పోరాడుతునే ఉంటాం..ఎందుకంటే మీరు మా బాధ్యాత’. అంటూ ఓ చెప్పిన డైలాగ్ బోర్డర్లో సైనికులకు అంకితం చేసేలా ఉంటుంది.
‘సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్… అన్నీ ఇండియా లు లేవు రా మనకి. ఒక్కటే ఇండియా … అబ్ భోల్ రహుం… నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా..’ డైలాగ్‌తో భారతదేశం అంత ఒకటే అని చెప్పకనే చెప్పారు బన్నీ.