గంజాయి(Ganjai) పెంచినా, విక్రయించినా వదలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. యాంటీ నార్కొటిక్స్ డే(Anti-Narcotics Day) సందర్భంగా గుంటూరు(Guntur)లో జరిగిన డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం విద్యార్థులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గంజాయి నియంత్రణ లేదని విమర్శించారు. అప్పటీ సీఎం జగన్ (Former Cm Jagan)ఒక్క సమీక్ష సైతం నిర్వహించలేదని తెలిపారు. ఈ రోజు గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నామన్నారు. ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ వెళ్లి డ్రగ్స్ నియంత్రిస్తామని చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌పై 1972కి సమాచారం ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే వారి అస్తులు సైతం జప్తు చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీల్లో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. డ్రగ్స్ ను నిర్మూలించేందుకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్‌కు సహకరించే వారిని ఏం చేయాలో తనకు తెలుసన్నారు.రాజకీయాలంటే తమాషా కాదని, గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిక్షం కూడా ముందుకు రావాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలో గంజాయికి కేంద్రంగా విశాఖ ఏజెన్సీని మార్చారని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసలైన వారు ప్రమాదకరంగా మారుతున్నారన్నారు. పసిపిల్లలపైనా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
































