స్కూళ్లకు దసరా సెలవుల పై ప్రభుత్వం తాజా ఉత్తర్వులు, అప్పటి వరకే

విద్యా సంస్థలకు దసరా సెలవుల పైన అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాల్సి వచ్చింది.


దీంతో, దసరా సెలవుల విషయంలో కొంత స్పష్టత లోపించింది. సిలబస్ పూర్తి చేయటానికి సెలవులు కుదింపు పైన స్కూళ్లల్లో చర్చ జరిగింది. దీంతో, సెలవుల్లో సొంత ప్రాంతాలకు వెళ్లే వారు ఆలోచనలో పడ్డారు. కాగా, ఇప్పుడు దసరా సెలవుల పైన విద్యా శాఖ అధికారికంగా ప్రకటన చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా 13 రోజుల పాటు దసరా సెలవులను ప్రకటించారు. అన్ని పాఠశాలలకు సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 3 వరకు పాఠశాలలకు విద్య శాఖ దసరా సెలవులు ప్రకటించింది. సెలవుల అనంతరం విద్యార్థులు అక్టోబర్‌ 24 నుంచి 31 వరకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ) – 1 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పరీక్షా పత్రాల మూల్యాంకనం అనంతరం ఎస్‌ఏ – 1 ఫలితాలు నవంబర్‌ 6న ప్రకటిస్తారు. ఎస్‌ఏ – 1 పూర్తైన తర్వాత నవంబర్‌ నెలలో బోధన తప్పించి పరీక్షలు ఉండవు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్​ జూనియర్ కాలేజీలకు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 5 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 2 సెలవు సైతం ఈ సారి దసరా సెలవుల్లోనే వెళ్లిపోనుంది.

కాగా, అక్టోబర్‌ 4న స్కూళ్లు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ షెడ్యూల్​ను అకడమిక్ క్యాలెండర్​లో అధికారులు ప్రకటించారు. సెలవులకు ముందు పాఠశాలలు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ) – 2 పరీక్షలు పూర్తి చేయాలని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇక.. వర్షాల కారణంగా సెలవులు ఇచ్చిన కారణంగా దసరా సెలవులు ముందుగా ప్రకటించిన విధంగా అమలు పై చర్చ జరిగింది. ఇప్పుడు అధికారికంగా విద్యా శాఖ స్పష్టత ఇవ్వటంతో… ఇక, ముందస్తుగానే ప్రయాణాలకు రిజర్వ్ చేసిన వారికి రిలీఫ్ దక్కింది. ఇక.. దసరా, బతుకమ్మ వేడుకల వేళ రైల్వే… ఆర్టీసీ అదనపు సర్వీసులను ఏర్పాటు చేసింది. ఇప్పటకే రెగ్యులర్ ట్రైన్స్ లో రిజర్వేషన్లు నిండుకున్నాయి. ఈ రోజు నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు కొనసాగుతున్నాయి. రేపు గణేష్ నిమజ్జనం కారణంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.