జాబ్ లేదని ఖాళీగా ఉండొద్దు.. నెలకు 69 వేల జీతంతో Govt జాబ్స్

www.mannamweb.com


సరైన క్వాలిఫికేషన్ ఉండి కూడా ఖాళీగా ఉండొద్దు. చిన్నా జాబ్ అయినా సరే ప్రయత్నం మానుకోవద్దు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. కెరీర్ లో త్వరగా సెటిల్ అవ్వాలంటే ఏ నోటిఫికేషన్ ను కూడా వదలకండి. మీరు ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 69 వేల జీతం అందుకోవచ్చు. అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఎంపిక ఎలా చేపడతారు? ఆ వివరాలు మీకోసం.

మీరు టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే ఈ జాబ్స్ మీకోసమే. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌ /ట్రేడ్స్‌మెన్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌ /ట్రేడ్స్‌మెన్‌ (బార్బర్, సఫాయి కర్మచారి–గార్డెనర్‌) పోస్టుల భర్తీ చేయనున్నది. మొత్తం 143 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 21-25 ఏళ్లు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 26 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 143
అర్హత:

కానిస్టేబుల్‌/ట్రేడ్స్‌మెన్‌(బార్బర్, సఫా­యి కర్మచారి–గార్డెనర్‌) పోస్టులకు మెట్రిక్యులేషన్‌/పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత వృత్తిలో పని అనుభవం ఉండాలి. కానిస్టేబుల్‌(గార్డెనర్‌)పోస్టులకు మెట్రిక్యులేషన్‌ లేదా పదో
తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.

వయోపరిమితి:

కానిస్టేబుల్‌(బార్బర్‌/సఫాయి కర్మచారి) పోస్టులకు 21 నుంచి 25 ఏళ్లు, కానిస్టేబుల్‌(గార్డెనర్‌) పోస్టులకు 21 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), రాతపరీక్ష, ఒరిజనల్‌ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్‌ స్కిల్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.21,700 నుంచి 69,100 అందిస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది:

28-07-2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:

26-08-2024