పప్పుల ధరల పెరుగుదలను అరికట్టేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ బుధవారం సబ్సిడీలో పప్పులను అందించే కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమాన్ని ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు.
దీంతో వినియోగదారులకు సహకార రిటైల్ నెట్‌వర్క్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ పప్పు రకాలైన శనగ, కంది, పెసర, కంది, ఎర్ర పప్పులను తగ్గింపు ధరలకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు బియ్యం, పిండిని కూడా తక్కువ ధరల్లో విక్రయించనుంది.
పప్పు దినుసులలో ధర స్థిరత్వాన్ని కొనసాగించడానికి బఫర్ నుండి ఆఫ్‌లోడ్ చేస్తున్నామని దీపావళి పండగకు భారత్ దాల్ ఫేస్- II ప్రాజెక్టును ప్రారంభించినట్లు జోషి చెప్పారు. ప్రభుత్వం రిటైల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పంపిణీ చేయడానికి 0.3 మిలియన్ టన్నుల (MT) శనగలు, పెసర 68,000 టన్నుల కేటాయించింది.
శనగ ఇప్పుడు కిలో 58, శనగ స్ప్లిట్ రూ.70 ఉంది. అలాగే ఎర్రపప్పు రూ.89 ఉంది. ఇది నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ వంటి సహకార సంస్థల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ధరలు మార్కెట్ ధరల కంటే కనీసం 20% నుండి 25% వరకు తక్కువగా ఉన్నాయి.
బఫర్ స్టాక్‌ను విడుదల చేయడం ద్వారా తక్కువ ధరకు అందుకోవచ్చు. భారత్ దాల్ విక్రయాలను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల ప్రస్తుత పండుగ సీజన్‌లో వినియోగదారులకు సరఫరాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ వంటి పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి గత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాన్ని పంపిణీ చేశాయని, కంది, మినుము, పెసర వంటి పప్పు దినుసులను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి కొనుగోలు చేయడానికి హామీ ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ సంవత్సరం ఖరీఫ్ పప్పుల మెరుగైన ప్రాంతాల్లో సాగు జరిగిందని, జూలై, 2024 నుండి చాలా పప్పుల ధరలలో తగ్గుదల ధోరణికి దారితీసిందన్నారు. దీంతో పప్పుల ధరలు తగ్గాయన్నారు. పప్పు దినుసుల ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 113% నుండి సెప్టెంబర్‌లో 9.8% పెరిగింది. ఖరీఫ్ పంటలు, దిగుమతులు బలంగా ఉండే అవకాశాల కారణంగా ధరలు తగ్గాయి.
గత ఏడాది అక్టోబర్‌లో భారత్ బ్రాండ్ కింద గోధుమలు, బియ్యం, పప్పు వంటి నిత్యావసర వస్తువుల అమ్మకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఇది జూన్ వరకు కొనసాగింది. అదనంగా ప్రభుత్వం ప్రస్తుతం ఉల్లిపాయలకు రూ.35కేజీకి, టమోటాలకు కిలో రూ. 65 ధరలను నిర్ణయించినట్లు తెలిపారు. సహకార సంఘాలు, ఇతర ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు నేరుగా పంపిణీ చేస్తోందన్నారు.