ఎంతటి మొండి రోగానికైనా విరుగుడు.. ఈ గింజలు గుప్పెడు తింటే చాలు

ఒక చిన్న ఆకుపచ్చని గింజ ఇప్పుడు వైద్యారోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది. తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు సైతం ఇది నివారణగా పనిచేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.
ఆస్తమా నుంచి కీళ్లనొప్పుల వరకు, మూత్ర పిండాల నుంచి కాలేయ వైఫల్యం వరకు అన్నింటికీ అద్భుతంగా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. అవే ఆకుపచ్చని అవిసె గింజలు (Green Flax Seeds). వీటిని ఇప్పుడు చాలా మంది ‘సూపర్‌సీడ్స్‌’గా వ్యవహరిస్తున్నారు.


అనేక రకాల వ్యాధుల నివారణ, చికిత్సకు మానవ సమాజం శతాబ్దాలుగా ప్రకృతిపైనే ఆధారపడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఆకుపచ్చని అవిసె గింజల (Green Flax Seeds) శక్తిని పరిశోధనల ద్వారా ఇటీవల శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. వీటిలో పెద్ద మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు. క్లిష్టమైన ఫార్మా చికిత్సలు అవసరమయ్యే మొండి రోగాలను సైతం ఇది నయం చేస్తున్నట్లు కనిపెట్టారు.

ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు
ఆకుపచ్చని అవిసె గింజల్లో (Green Flax Seeds) ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల ఆస్తమా బాధితులకు ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడి, శ్వాస తీసుకోవడం సులభమవుతుంది. వీటిని డైట్‌లో భాగం చేసుకున్న కొన్ని రోజుల్లోనే ఆస్తమా లక్షణాలు తగ్గినట్లు కొందరు బాధితులు వెల్లడించారు.

ఆర్థరైటిస్‌, కీళ్లనొప్పులు
ఈ సమస్యతో బాధపడుతున్న వారు దీర్ఘకాల చికిత్సలు కొనసాగిస్తుంటారు. అయినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉపశమనం ఉండదు. జాయింట్లు సహా కండరాళ్లలో తీవ్రవైన నొప్పి కలుగుతుంటుంది. అయితే ఆకుపచ్చని అవిసె గింజల్లో ఉండే ఒమెగా ఫ్యాటీ-3 యాసిడ్స్‌ వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి ఉపశమనం లభిస్తుంది.

కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం
ఈ అవయవాల పాత్ర మన శారీరక ప్రక్రియల్లో చాలా కీలకం. వీటిలో తలెత్తే లోపాలను సైతం ఆకుపచ్చని అవిసెలు నయం చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటిలో ఉండే డీటాక్సిఫైయింగ్‌ ఏజెంట్లు శరీరంలో వ్యర్థాలను బయటకు పంపడంతో పాటు డ్యామేజ్‌ అయిన కణాలను నయం చేస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే కాలేయం పనితీరు మెరుగుపడినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. కిడ్నీ వైఫల్యాన్ని సైతం క్రమంగా నయం చేసినట్లు కనుగొన్నారు.

బరువు నియంత్రణ
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో బరువు నియంత్రణలో ఉంచుకోవడం పెద్ద సవాల్‌గా మారిపోయింది. అయితే గ్రీన్‌ ఫ్లాక్స్‌ సీడ్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే బరువు కంట్రోల్‌లో ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అందులో ఉండే పీచు పదార్థమే అందుకు కారణం.

యాంటీ క్యాన్సర్‌ గుణాలు
ఈ గింజల్లో ఫ్లేవనాయిడ్స్‌, పాలీఫినాల్స్‌ వంటి యాంటీ క్యాన్సర్‌ గుణాలు కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌పై పోరాటం చేస్తాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తున్నట్లు ప్రాథమిక పరిశోధనల్లో తేలింది. పైగా ఇప్పటికే ఉన్న క్యాన్సర్‌ కణాల వృద్ధిని సైతం తగ్గిస్తున్నట్లు తెలిపారు.

వీటితో పాటు గుండె ఆరోగ్యం, చర్మ సమస్యలు, షుగర్‌ కంట్రోల్‌, రోగనిరోధక శక్తి పెరగడం, ఎముకల పటుత్వాన్ని పెంచడం వంటి ప్రయోజనాలు సైతం ఉన్నాయి. దీర్ఘకాల మొండి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కోసం వేచిచూస్తున్నవారికి ఈ ఆకుపచ్చని అవిసె గింజలు ఒక వరమనే చెప్పవచ్చు. వీటితో ఎలాంటి దుష్ప్రభావాలు లేకపోవడం మరో ప్రత్యేకత.