జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయలేదా..? కొత్త నిబంధన తెలుసుకోకుంటే ఇబ్బందే

www.mannamweb.com


జీఎస్టీ రిటర్న్స్ అంటే అమ్మకాలు, కోనుగోళ్లపై చెల్లించిన పన్నులు, వ్యాపారం ద్వారా అందించిన ఉత్పత్తి లేదా సేవ అమ్మకాాలపై స్వీకరించిన పన్నుల గురించి వివరాలు తెలిపే రికార్డు అని చెప్పవచ్చు.

కాబట్టి ప్రతి వ్యాపారస్తుడు జీఎస్టీ రిటర్న్ లను తప్పనిసరిగా సమర్పించాలి. దీని వల్ల వ్యాపార లావాదేవీల రికార్డు స్పష్టంగా ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక, ఆడిట్ లు, ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. జీఎస్టీ చట్టం కింద నమోదు చేసిన ప్రతి వ్యాపార సంస్థ రిటర్న్స్ అందజేయాలి. అలాగే ఇ-కామర్స్ ఆపరేటర్లు, జీఎస్టీలో నమోదు చేయబడిన నాన్ రెసిసెంట్ ఎంటీటీలు కూడా దాఖలు చేయాలి. కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో జీఎస్టీ రిటర్న్ లను పన్నుదారులు వీలైనంత త్వరగా దాఖలు చేయాలి.

అలాగే పెండింగ్ ఫైలింగ్ ను నిర్ణీత గడువులోగా అందజేయాలి. మూడేళ్ల లోపు ఫైలింగ్ దాఖలు చేయాలని నిబంధన విధించిన నేపథ్యంలో ఆ గడువు దాటితే పన్ను ఎగవేత దారులుగా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారీగా జరిమానాలు కట్టాల్సి రావచ్చు. దానితో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త నిబంధనలపై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మూడేళ్ల తర్వాత జీఎస్టీ రిటర్స్స్ ఫైలింగ్ చేయడాన్ని నిషేధించడంపై సానుకూలంగా స్పందించారు. దీనివల్ల డేటా విశ్వసనీయత మెరుగుపడుతుందన్నారు. సకాలంలో ఫైలింగ్ జరగడానికి తోడ్పడడంతో పాటు రిటర్న్ ల బ్యాక్ లాగ్ ను విపరీతంగా తగ్గిస్తుందన్నారు. అలాగే పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సత్వరమే రూపొందించుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు.

జీఎస్టీ రిటర్న్ లను సకాలంలో అందజేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జరిమానాలను, ఆలస్య రుసుముల నుంచి తప్పించుకోవచ్చు. రుణాలు, టెండర్లు, పెట్టుబడిదారులను ఆకట్టుకునే అవకాశం కలుగుతుంది. వ్యాపార పనితీరును విశ్లేషించడానికి, మెరుగుపర్చుకోవడానికి, ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా వీలుంటుంది. అయితే పర్యవేక్షణ, సంబంధిత పత్రాలు లేకపోవడం, రిజిస్ట్రేషన్ సస్పెన్షన్ కారణంగా జీఎస్టీ రిటర్న్ లను దాఖలు చేయని వారిపై కొత్త నిబంధనతో తీవ్ర ప్రభావం పడుతుంది. ఏది ఏమైనా గడువు తేదీ నుంచి మూడేళ్ల లోపు రిటర్న్ లను ఫైలింగ్ చేయడానికి అవసరమైన సమాచారం దగ్గర ఉంచుకోవాలి.