పెరుగు పుల్లగా మారిందా? పడేయకండి.. ఇలా చేస్తే చిటికెలో పులుపు మాయం

www.mannamweb.com


పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

ప్రతిరోజూ ఒక గిన్నెడు పెరుగు తీసుకుంటే.. అంతకు మించిన ఔషధం మరొకటి లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇంట్లో తయారుచేసిన పెరుగు ఆరోగ్యానికి ఉత్తమమైనది. కానీ ఇంట్లో తయారు చేసిన పెరుగు ఎక్కువ కాలం నిల్వ చేయడం సాధ్యం కాదు. వెంటనే పాడై పోతుంటుంది. దాంతో మార్కెట్‌లో దొరికే పెరుగుపైనే ఆధారపడవల్సి వస్తుంది. కానీ సమస్య ఏమిటంటే.. పెరుగును ఎక్కువ కాలం నిల్వ ఉంచితే దాని రుచి, పోషక విలువలు కూడా పోతాయి.

పెరుగును ఎక్కువసేపు ఉంచితే దాని రుచి మరింత పుల్లగా మారుతుంది. అస్సలు తినలేం. అప్పుడు పెరుగును పారేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇలా కాకుండా ఉండాలంటే ఈ చిట్కా ట్రై చేయండి.

పెరుగులోని అదనపు పులుపుని తొలగించడానికి పెరుగు నుంచి నీటిని తొలగించాలి. పెరుగులో నీటిశాతం ఎక్కువగా ఉన్నప్పుడే వడకట్టాలి. తర్వాత మళ్లీ అందులో చల్లటి నీళ్లు పోసి చెంచాతో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. పెరుగును నీటితో కలుపుతున్నప్పుడు, పెరుగు మీగడ కరగకుండా జాగ్రత్త పడాలి. తర్వాత స్టయినర్ సహాయంతో పెరుగును వడకట్టి నీటిని వేరు చేయాలి.

పెరుగు నుంచి నీరు బయటకు తీసిన తర్వాత ఒక గిన్నె నిండా చల్లని పాలు అందులో పోయాలి. అనంతరం పెరుగును 2-3 గంటలు అలాగే వదిలేయాలి. పెరుగు మొత్తాన్ని బట్టి పాలను వాడాలి. ఈ చిట్కా పెరుగులోని అదనపు పులుపును తొలగిస్తుంది.