ఏ డ్రై ఫ్రూట్స్‌.. ఎందుకెందుకు తినాలో.. మీరెప్పుడైనా ఆలోచించారా?

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల శరీరంలోని ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రతి డ్రై ఫ్రూట్‌లోనూ ఆరోగ్యానికి అవసరమైన వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.


డ్రై ఫ్రూట్స్ రుచికరమైనవి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వివిధ డ్రై ఫ్రూట్స్ మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం..

తరచుగా అలసిపోయినట్లు, బలహీనంగా ఉంటే ప్రతిరోజూ మీ ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవాలి. ఖర్జూరాలలో సహజ చక్కెర, అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అవి రోజంతా పని చేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

బ్లూబెర్రీస్ తినడం వల్ల మెదడు చురుకుగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఆంథోసైనిన్లు మెదడు కణాలను బలోపేతం చేస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. బ్లూబెర్రీస్ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు తమ ఆహారంలో క్రాన్బెర్రీలను చేర్చుకోవచ్చు. దీనిలోని సహజ పదార్థాలు బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. ఇది UTI లక్షణాలను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందడంలో ఎండుద్రాక్షలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వాటిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మంచి గట్ హెల్త్ కోసం ప్రతిరోజూ అంజీర్ పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. అంజీర్ పండ్లలో ప్రీబయోటిక్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మంచి గట్ బాక్టీరియాను ప్రోత్సహిస్తాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.