పొలానికి మందు పిచికారీ చేస్తున్న మంత్రి నిమ్మల
పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆయన రాష్ట్రానికి మంత్రి. అయినప్పటికీ సామాన్య రైతులా పొలం పనులు చేస్తుంటారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడి (Nimmala Ramanaidu) కి కనుమ పండగ నాడు కొంత తీరిక సమయం దొరికింది. దీంతో ఉదయాన్నే సొంతూరు ఆగర్తిపాలెంలో ఉన్న పొలానికి వెళ్లి వరికి మందు పిచికారీ చేశారు. మొదటి నుంచీ ఆయనకు పొలం పనులంటే ఇష్టం. కళాశాల అధ్యాపకుడిగా పని చేస్తున్నప్పుడూ వ్యవసాయం చేసి వరిలో ఎకరానికి 55 నుంచి 60 బస్తాల దిగుబడి తీశారు. ‘తీరిక సమయంలో పొలం వెళ్లి పని చేయడం నిజమైన సంతృప్తినిస్తుంది’ అని మంత్రి చెప్పారు.