అతను ఐ లవ్ యు అనగానే ఓకే చెప్పేశా.. ఎట్టకేలకు ప్రేమ విషయం పై స్పందించిన అనుష్క

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క్ శెట్టి(Anushka Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘ఘాటీ'(Ghati) సినిమాతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.


క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ ప్రభు(Vikram Prabhu) హీరోగా నటిస్తున్నాడు. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇప్పటివరకు మ్యారేజ్ చేసుకోకుండా స్టిల్ సింగిల్‌గా ఉంది. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)తో ఈ బ్యూటీ డేటింగ్‌లో ఉందనే ఇప్పటికే చాలా సార్లు పలు రూమర్స్ వినిపించాయి. కానీ ఆ వార్తలపై ఇటు అనుష్క కానీ అటు ప్రభాస్ కానీ స్పందించలేదు.

ఈ క్రమంలో ఎట్టకేలకు తన ఫస్ట్ లవ్ అతనే అంటూ బిగ్ బాంగ్ పేల్చింది ఈ చిన్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క మాట్లాడుతూ..’నేను ఆరో తరగతి చదువుతుండగా ఒక క్లాస్‌మేట్ నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అన్నాడు. నాకు ఆ మాట అర్థమే తెలియదు కానీ ఏదో మనసుకు బాగా నచ్చేసి నేను అతనికి ఓకే చెప్పేశాను. నిజంగా అది ఎంతో చిన్న విషయమే అయినా నాకు ఇప్పటికీ మధుర జ్ఞాపకంగా మిగిలి పోయింది’ అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.