కొందరు తెలివితో చేసే పనులు చూస్తే అవాక్కయ్యేలా ఉంటాయి. మరికొందరు అతి తెలివితో చేసే వింత వింత ప్రయోగాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంట్లోని వస్తువులతో వివిధ రకాల ప్రయోగాలు చేసే వారిని తరచూ చూస్తుంటాం.
ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ వ్యక్తి తయారు చేసిన ఫ్యాన్ చూసి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కరెంట్ అవసరం లేకుండా గిర్రున తిరుగుతున్న ఫ్యాన్ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కరెంట్ అవసరం లేకుండా తిరుగుతున్న ఫ్యాన్‌ను తయారు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకోసం ఆ వ్యక్తి ముందుగా ఓ చెక్క, బేరింగ్, ఇనుప కడ్డీ, కొన్ని బోల్టులతో పాటూ మూడు రబ్బర్లను తీసుకున్నాడు. చెక్క పలకకు నిలబెట్టి, దాని పైభాగంలో రంధ్రం చేశాడు.
ఆ రంధ్రంలో ఇనుప బేరింగ్, కడ్డీని పెట్టి.. అవతలి వైపు ఫ్యాన్ రెక్కలు ఏర్పాటు చేశాడు. అలాగే ఇవతలి వైపు మరో చెక్క పలకను అడ్డంగా పెట్టాడు. ఆ తర్వాత మూడు రబ్బర్లు త్రిభుజాకారంలో ఫ్యాన్ రాడ్‌కు తగిలించాడు. ఫైనల్‌గా ఫ్యాన్‌ను గిర్రున తిప్పగానే.. (fan rotating with help of rubbers) రబ్బర్లు అటూ, ఇటూ లాగడం వల్ల ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఇలా రబ్బర్ల సాయంతో ఆ ఫ్యాన్ అలా తిరుగుతూనే ఉందన్నమాట.
ఈ విధంగా విద్యుత్ అవసరం లేకుండా ఫ్యాన్‌ను గిరగిరా తిప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ”వార్నీ ఈ ఐడియా ఏదో భలేగా ఉందిగా”.. అంటూ కొందరు, ”ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు”.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 లక్షలకు పైగా లైక్‌లు, 58 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది
































