ఇది తింటే చావు అంచుల్లో ఉన్నవారు కూడా లేచి డ్యాన్స్ చేస్తారు.. ఫ్రీగా దొరుకుతుంది

www.mannamweb.com


సరిగ్గా గమనిస్తే మన చుట్టే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిం ఆహరం మనకు దొరికేస్తుంది. ఎన్నో అంతరించిపోతున్న ఔషధాల ఘనులైన ఆహారపదార్థాలను ఆధునీకరణ మాయలో పడి మనం వదిలేస్తున్నాము.

అలాంటి కోవలోకి వస్తుంది ఈ అడవి దోసకాయలు లేదా చిన్న దోస కాయలు లేదా కాచారియా. దీనిని వివిధ ప్రదేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. వర్ష కాలంలో కేవలం రెండు నెలలు మాత్రమే దొరుకుతుంటాయి. వీటిని ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం కూడా లేదు.

పొలాల్లో, పెరట్లో, దొడ్లల్లో ఇది దానంతట అదే పెరుగుతుంది. ఈ కాచారియ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని వంట రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. అసలు ఈ కాచారియ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? దీనిని ఎలా తినాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఎక్కడ దొరుకుతుంది?

ఈ కాచారియ అనే కూరగాయను పండించడం చాలా అరుదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీనిని పండిస్తుంటారు. వీటి వర్షా కాలంలో సాధారణంగా వాటంతట అవే పెరుగుతుంటాయి. ఇవి నేలపై పాకుతూ తీగలాగా పెరుగుతాయి. వీటి పరిమాణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. రుచి దోసకాయ మాదిరిగా కొన్ని తీపిగా ఇంకొన్ని చేదుగా ఉంటాయి. దోసకాయ మాదిరిగానే వీటిపై చారలు ఉంటాయి.

ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే?

సహజ సిద్ధమైన పద్దతిలో పండే ఈ కూరకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చూడడానికి చిన్నగా కనిపిస్తున్నప్పటికీ, ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలో క్యాల్షియం, పొటాషియం, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. అలాగే కండరాల బలోపేతం కోసం ఈ కూరగాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ కూరగాయను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మురికి అంతా బయటికి వస్తుంది. గుండె, మూత్ర పిండాలను శుభ్రం చేయడంలో ఇది సహాయపడుతుంది. వృద్ధులకు తక్షణ శక్తి కోసం, మోకాళ్ళ నొప్పులు ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి బయట పడడానికి పనికొస్తాయి.

ధర ఎంత ఉంటుందంటే?

ఇన్ని లాభాలు, ఎంత ప్రయోజనాలు కలిగిన ఈ కూరగాయ సంవత్సరంలో కేవలం రెండు లేదా మూడు నెలలు మాత్రమే దొరుకుతుంది. సీజన్, డిమాండ్‌ను బట్టి దీని డిమాండ్ ఉంటుంది. దీని ధర కిలో రూ.40 నుంచి రూ.70 వరకు మార్కెట్లో పలుకుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉండే ఈ కూరగాయ మార్కెట్‌లో దొరికితే అస్సలు వదలకండి. ఇన్ని లాభాలు ఉన్న ఈ కూరగాయను తినకుండా వదిలిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మీరు వదిలేసినట్టే. ఇకనైనా మీకు అందుబాటులో ఈ కూరగాయ ఉంటే ఓసారి వండుకొని తినండి, ఆరోగ్యంగా జీవించండి.