నెలరోజులు రెగ్యులర్‌గా అరటి తింటే.. శరీరంలో జరిగే మార్పులివే

www.mannamweb.com


అరటి పండు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీజన్‌తో సంబంధం లేకుండా తక్కువ ధరకు అందుబాటులో ఉండే అరటి పండ్లను రెగ్యులర్‌గా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

అందుకే అరటి పండును పేదల ఆపిల్‌గా చెబుతుంటారు. ఇందులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే నెల రోజుల పాటు అరటి పండును రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రెగ్యులర్‌గా అరటి పండును తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక అరటిని పండు తిని పడుకుంటే ఉదయం సుఖ విరోచనం అవుతుంది. కడుపుబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలన్నీ దూరమవుతాయి. పాలలో అరటి కలుపుకొని తీసుకుంటే మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి కూడా అరటి పండు బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్‌గా అరటి పండు తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. అరటిలో పుష్కలంగా ఉండే పొటాషియం, విటమిన్‌ బి6 రక్తపోటును అదుపులో ఉంచడంలో ఉపయోగపడతాయి. అందుకే అరటిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయని అంటున్నారు.

మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే సమస్యలకు అరటి పండు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆ సమయంలో వచ్చే నొప్పికి చెక్‌ పెట్టడంలో అరటి సహాయపడుతుంది. ముఖ్యంగా అరటిని బెల్లంలో కలుపుకొని తింటే బలహీనత దూరమవుతుంది. బరువు పెరగాలనుకునే వారికి కూడా అరటి పండు బాగా ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా అరటి పండును తీసుకుంటే నెల రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి పాలలో అరటి కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్‌ బి లోపంతో బాధపడేవారికి కూడా అరటి పండు బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్‌గా అరటి పండును తీసుకుంటే.. నోట్లో వచ్చే నోటి పూత, అల్సర్‌ వంటి సమస్యలకు చెక్‌ పెట్టడంలో ఉపయోగపడుతుంది.