Health Tips: డయాబెటిస్ బాధితులకు అలెర్ట్.. ప్రతిరోజూ ఇలా నడిస్తే మీ బ్లడ్‌ షుగర్​ఫుల్ కంట్రోల్​!

మధుమేహం చాలా క్లిష్టమైన వ్యాధి. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే, గుండె, మూత్రపిండాలు, కళ్ళు, నరాలు సహా శరీరంలోని అనేక అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి.


కాబట్టి బ్లడ్ షుగర్ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇక రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం మానేయాలి. దానితో పాటు, ప్రతిరోజూ తగినంత సమయం నడవడం ముఖ్యం. అప్పుడే చక్కెరతో ఆరోగ్యంగా జీవించవచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, రోజుకు ఎంత సమయం వాకింగ్ చేస్తే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది? దీనికి సమాధానం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న ప్రయోజనాలు పొందగలుగుతారు.

వాకింగ్ మధుమేహ రోగులకు రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. మొదటిది నడక అనేది శారీరక వ్యాయామం. కాబట్టి, ఈ వ్యాయామం చేయడం వల్ల అదనపు కేలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రెండవది, వాకింగ్ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అందువల్ల, శరీరంలోని కణాలు రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని కారణంగా చక్కెర స్థాయి తగ్గుతుంది. అందువల్ల మధుమే రోగులందరూ క్రమం తప్పకుండా వాకింగ్‌ చేయాలని వైద్యులు చెబుతుంటారు.

40 ఏళ్లు వచ్చిన తర్వాత కండరాలు క్షీణించడం ప్రారంభిస్తాయి. ఇది చాలా సాధారణ శారీరక ప్రక్రియ. అయితే, డయాబెటిక్ రోగుల శరీరం కండరాలను కోల్పోయినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరుగుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ వ్యాధితో బాధపడేవారు కండరాల బలాన్ని పెంచుకోవాలి. దీనికోసం వాకింగ్‌ కోసం రోజులో కొంత సమయం కేటాయించండి . మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు. బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే రోజులో కనీసం 45 నిమిషాల పాటు నడవాలి. స్టెప్పుల విషయానికొస్తే కనీసం 6 వేల అడుగులు నడవాలి అయితే రోజుకు 9 నుంచి 10 వేల అడుగులు నడవగలిగితే. అప్పుడు మీరు ఎక్కువ లాభం పొందుతారు. అలాగే, రోజులో మీరు వాకింగ్ సమయాన్ని 3 భాగాలుగా విభజించుకోవాలి. అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం తర్వాత 15 నిమిషాలు నడవడం మంచిది. ఇలా చేయడం వల్ల షుగర్‌ని సులభంగా నియంత్రించుకోవచ్చు. అలాగే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.