ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే.. మీ శరీరంలో ఉహించని మార్పులు

www.mannamweb.com


జీలకర్ర టైప్ 2 డయాబెటిస్‌లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సీరం ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది. జీలకర్రలో ఉండే ఐరన్, పీచు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, సీజనల్ వ్యాధులతో పోరాడటానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు జీలకర్ర నీరు తాగడం వల్ల మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది.

జీలకర్ర.. ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉపయోగించే మసాలా దినుసు.. జీలకర్ర ఆహారానికి మంచి రుచిని అందిస్తుంది. అంతేకాదు..అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీలకర్రలో పాలీఫెనాల్స్, శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించే అనేక ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. వివిధ రకాల జీర్ణ సమస్యలను దూరం చేయడంలో జీలకర్ర నీరు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీటితో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మంచి జీర్ణవ్యవస్థ సమర్థవంతమైన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెరుగైన జీర్ణక్రియ జీవక్రియ రేటును మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో కూడా జీలకర్ర నీరు అద్భుతంగా సహాయపడుతుంది. శరీరంలోని అధిక కొవ్వును తగ్గించడంలో జీలకర్ర సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జీలకర్ర నీరు తాగటం వల్ల శరీరం కొత్త, ఆరోగ్యకరమైన కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. జీలకర్ర నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

జీలకర్రలోని ఫ్లేవనాయిడ్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. జీలకర్ర టైప్ 2 డయాబెటిస్‌లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సీరం ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది. జీలకర్రలో ఉండే ఐరన్, పీచు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, సీజనల్ వ్యాధులతో పోరాడటానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు జీలకర్ర నీరు తాగడం వల్ల మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)