పెరిగే వయసుకు కళ్లెం వెయ్యాలా? ఇవి తప్పక తీసుకోవాల్సిందే!

ఏజింగ్ అనేది ఎవరికీ ఇష్టం లేకపోయినా జీవితంలో తప్పని తతంగం. వయసు పెరగడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. రోజుల గడిచే కొద్దీ తప్పకుండా వయసు పెరుగుతుంది.
అందుకు అనుగుణంగా శరీరంలో మార్పులు తప్పవు. శరీరంలో శక్తి సన్నగిల్లడం, మతి మరుపు, కొన్ని సార్లు దంతాలు ఊడి పోవడం, మాటల్లో స్పష్టత లోపించడం, దీర్ఘకాలికంగా వేదించే ఒళ్లు నొప్పులు ఇలా రకరకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకే వయసు పెరగడం ఎవరికి సంతోషంగా ఉండదు.

అయితే మన శరీరాలను బాగా చూసుకుంటే కొన్నాళ్లయినా వయస్సును వెనక్కి నెట్టవచ్చు. కింగ్ నాగార్జునలా యవ్వనంగా కనిపించవచ్చు. సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం ద్వారా పెరిగే వయసు పెద్దగా బాధించదనేది నిపుణుల అభిప్రాయం.

ఇక న్యూట్రిషన్ విషయానికి వస్తే ఆరోగ్యవంతంగా యవ్వనంగా కనిపించేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఉన్నాయట. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లతో నిండివున్న గింజలు అవే అవిసెలు లేదా అవిసెగింజలు వీటినే ఫ్లాక్ సీడ్స్ అంటారు.

Related News

ఈ గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే దీర్ఘాయువు సాధ్యమే అని నిపుణులు అంటున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు అందరూ రోజువారీ ఆహారంలో ఒకటి రెండు స్పూన్ల అవిసెగింజలను చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు.

సలాడ్లో లేదా ఓట్మీల్ మిక్చర్ లో వీటిని కలుపుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలు ఉంటాయట. ఇది పొడిగా తీసుకున్నా ఫర్వాలేదంటున్నారు.

రెండు స్పూన్ల అవిసె గింజల్లో ఉండే పోషకాలు

2.6 గ్రా. ప్రొటీన్

37 కాలరీలు

2 గ్రాముల డైటరీ ఫైబర్

2 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్

అవిసె గింజల పొడి కూడా చాలా ఆరోగ్యకరం. ఇలా పొడి రూపంలో తీసుకున్నపుడు జీర్ణం కావడానికి సులభంగా ఉంటుంది. పొడి రూపంలో వీటిలోని పోషకాలను శరరీం త్వరగా గ్రహిస్తుంది. కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకుంటే వాడుకునేందుకు సులభంగా ఉంటుంది.

యవ్వనంగా ఉంచడంలో అవిసె గింజల ప్రాధాన్యత

మధ్య వయసు చివరలో ఉన్న వారిలో ఏజింగ్ కు సంబంధించిన సమస్యలు నెమ్మదిగా బాధించడం మొదలవుతుంది. ఇలాంటి సమస్యలను వాయిదా వెయ్యడంలో అవిసెగింజలు మంచి పాత్ర పోషిస్తాయి.

వీటిలో ఉంటే పోషకాలు ఒబెసిటిని తగ్గిస్తాయి.

దీర్ఘకాలంగా వేధించే డయాబెటిస్ వంటి సమస్యలను ఎదుర్కోడానికి తోడ్పడుతాయి.

శరీరంలో ఇన్ప్లమేషన్ తగ్గిస్తాయి.

ఇవి మంచి యాంటీ క్యాన్సరస్ ఆహారం.

కిడ్ని ఆరోగ్యానికి కూడా మంచిది.

గుండె ఆరోగ్యానికి దోహదం చేసి హార్ట్ ఎటాక్ రిస్క్ లేకుండా చేస్తాయి.

కొలెస్ట్రాల్, బీపి ని అదుపులో ఉంచుతాయి.

మెదడు పని తీరును కూడా మెరుగు పరిచి డిమెన్షియా, అల్జైమర్స్ నుంచి రక్షిస్తాయి.

కండరాల క్షీణతను వాయిదా వేసి మొబిలిటి సమస్యలు రాకుండా కాపాడుతాయి.

Related News