ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే గుండె పోటు వచ్చేది. కానీ ఇప్పుడు చాలా చిన్న వయస్సులో ఉన్నవారు కూడా గుండె పోటు బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రస్తుతం గుండె పోటు అనేది కామన్ అయిపోయింది.
ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే గుండె పోటు వచ్చేది. కానీ ఇప్పుడు చాలా చిన్న వయస్సులో ఉన్నవారు కూడా గుండె పోటు బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రస్తుతం గుండె పోటు అనేది కామన్ అయిపోయింది. అయితే ఇది చాప కింద నీరులా విస్తరిస్తుండడంతో ప్రతి ఒక్కరు తమ గుండె ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కచ్చితంగా గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే గుండె పోటు బారిన పడతారు. అయితే కొన్ని రకాల సూచనలు పాటిస్తే గుండె పోటు రాకుండా ఉండవచ్చు. హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే నియంత్రించవచ్చు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ స్థాయిలు..
మీ శరీరంలో కొవ్వు స్థాయిలు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ 130 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోండి. లేదంటే రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో బీపీ పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌పై దృష్టి పెట్టాలి. కొలెస్ట్రాల్ లెవల్స్ ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా మీరు తీసుకునే ఆహారంలో నూనె పదార్థాలు లేకుండా జాగ్రత్త పడండి. నూనె పదార్థాలను అధికంగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది హార్ట్ ఎటాక్‌ను కలగజేస్తుంది. కనుక నూనె పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. దీంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది.
ధూమపానం, మద్యపానం..
ధూమ పానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ రెండింటి వల్ల కూడా చాలా మందికి గుండె పోటు వస్తుంది. కనుక ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉండాలి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం చాలా మంది నిత్యం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అనుక్షణం ఏదో ఒక రకంగా ఆందోళన చెందుతున్నారు. కానీ వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కనుక వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు గాను మీకు ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకాలను చదవడం చేయాలి. లేదా రోజూ ప్రకృతిలో కాసేపు గడిపితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
బీపీ..
బీపీని కూడా కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాలి. సాధారణ వ్యక్తులకు బీపీ 120/80 ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ లేదా తక్కువగా బీపీ ఉండడం మంచిది కాదు. ఇది హార్ట్ ఎటాక్‌లను కలగజేస్తుంది. కనుక బీపీ ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండేలా జాగ్రత్త వహించాలి. అలాగే బరువును కూడా కంట్రోల్‌లో ఉంచాలి. బరువు సరిగ్గా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నియంత్రించవచ్చు. బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వ్యాయామం చేయాలి. ఇక ఉప్పును కూడా తక్కువగా తినాలి. ఇలా పలు సూచనలను పాటిస్తే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.