Heart Attack: ఎవరైనా గుండెపోటుకు గురైతే వెంటనే ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసుకోండి

గుండెపోటు ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. చిన్నపాటి అవగాహనతో మెదిలితే ఈ ప్రమాదం నుంచి సులువుగా బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారు.
ఐదేళ్ల చిన్నారుల నుంచి పాతికేళ్ల యువకుల వరకు అత్యంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. గుండెపోటు వస్తే ఏం చేయాలో, ఏం చేయకూడదు అనే విషయాలపై అవగాహన ఉంటే సులువుగా ప్రమాదం నుంచి బయటపడొచ్చు. మీ పరిసరాల్లో ఎవరైనా గుండెపోటుకు గురైతే చూస్తూ ఊరుకోకూడదు. వెంటనే ఏం చేస్తే వారి ప్రాణం నిలబడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..


అనారోగ్యకరమైన ఆహారం, ధూమపానం, ఒత్తిడి, సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ తినే వారి రేటు పెరిగింది. కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు చాలా సాధారణం అయిపోయాయి. ఫాస్ట్ ఫుడ్‌లో చాలా కొవ్వు ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తపోటు, చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇవి ప్రత్యక్షంగా, పరోక్షంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే, గుండెపోటు లక్షణాలను ముందుగా గుర్తించడం వల్ల మరణాన్ని నివారించవచ్చు. గుండెపోటు ఛాతీ నొప్పి (నొప్పి), ఛాతీ బిగుతు (అసౌకర్యం), ఛాతీ కుడి లేదా ఎడమ వైపు నొప్పి లేదా రెండు వైపులా నొప్పి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఛాతీ నొప్పి ఎడమ చేయి నుంచి క్రింది నుంచి ప్రారంభమవుతుంది. క్రమంగా దవడ ద్వారా పైకి వ్యాపిస్తుంది. ఈ లక్షణాలతో పాటు గుండెపోటు వచ్చే సమయంలో అధిక చెమట వస్తుంది. రోగిలో ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే ఆస్పిరిన్ 300 mg (ఆస్పిరిన్ 300 mg) నీటిలో కలిపి ఇవ్వాలి. నాలుక కింద సార్బిటాల్ ట్యాబ్లెట్‌ ఉంచాలి. వెంటనే రోగిని సమీపంలోని ఏదైనా ఆసుపత్రి లేదా నర్సింగ్ హోమ్‌లో చేర్పించాలి.

సీపీఆర్‌ ఎలా చేయాలి..

గుండెపోటుకు గురైన వారికి తాత్కాలికంగా CPR (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) ఇవ్వవచ్చు. సమీపంలో ఎవరైనా గుండెపోటుకు గురైతే తొలుత వారిని ఫ్లాట్‌గా పడుకోబెట్టాలి. రోగిని మూసి ఉన్న గదిలో ఉంచకూడదు. గాలి బాగా వ్యాపించేలా ఇంటి కిటికీలు, తలుపులు తెరచి ఉంచాలి. ఆ తర్వాత రెండు చేతులతో ఛాతీపై భాగంలో ప్రెస్‌ చేయాలి. ఇలా చేసేటప్పుడు మీ చేతులు బెండ్​ కాకుండా స్ట్రైట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఛాతీని కనీసం 5 సెంటీమీటర్లు లోతుకు వెళ్లేలా నొక్కాలి. నిమిషానికి కనీసం 80 నుంచి 100 సార్లు ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ఒక నిమిషం చేశాక పల్స్ చెక్ చేయాలి. పల్స్ దొరక్కపోతే పేషెంట్ ముక్కు మూసి, అతని నోటిలోకి నోటితో ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. తరువాత మళ్లీ సీపీఆర్ చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు చేస్తుండాలి. ఇలా చేస్తే పేషెంట్ గుండె కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలా CPR చేయాలి. సీపీఆర్ ఎలా ఇవ్వాలో తెలిస్తే, రోగి జీవితాన్ని సులభంగా రక్షించవచ్చు.