Heatlh: ఉప్పు నీటిని నోటిలో వేసుకుని పుకిలిస్తున్నారా.. లేకుంటే వెంటనే అలవాటు చేసుకోండి.. ఎన్నో ప్రయోజనాలు..

వెదర్ (Weather) చేంజ్ అయింది. వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలుబు, దగ్గు సమస్యలు ఆహ్వానించని అతిథుల్లా వచ్చేస్తున్నాయి. అయితే బాగా వేధించే సమస్య గొంత నొప్పి.
దీని కోసం డాక్టర్లు, ఆస్పత్రులకు వెళ్లా్ల్సిన పని లేకుండా ఇంట్లోనే ఉండే పదార్థాలతో ఆరోగ్య చిట్కాలు పాటించవచ్చు. వంటింట్లో ఉండే ఉప్పును అధికంగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. కానీ నిర్ణీత పరిమాణంలో ఉపయోగిస్తే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఉప్పు నీటిని (Salt Water) గొంతులో పోసుకొని పుక్కిలించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గొంతు సమస్యలు ఉన్నా , శ్వాసకోశ సమస్యలు ఉన్నా ఉప్పు నీరు దివ్య ఔషదంగా పనిచేస్తుంది. కేవలం గొంతు సమస్య వచినప్పుడు మాత్రమే కాకుండా నిత్యం ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రోజూ బ్రష్‌ చెసుకున్న తర్వాత ఉప్పు నీటిని నోట్లో వేసుకొని పుక్కిలించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. గొంతులో ఉండే బాక్టిరియాలు, వైరస్ లు వంటి హానికారకమైన సూక్ష్మజీవుల బారి నుంచి రక్షిస్తుంది. యాసిడ్ లెవెల్స్ ను తటస్థంగా ఉంచుతుంది. ఫలితంగా ఫీహెచ్ స్తాయిలు సమతుల్యం అవుతాయి. ఇలా చెయడం వలన నోటిలో ఉన్న బ్యాక్టీరియా నశించి, నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఉప్పు నీటిని పుక్కిలించడం ద్వారా ముక్కు దిబ్బడ తగ్గుతుంది. నోటిలో పొక్కులు, పుండ్లు ఉన్న వారు ఇలా చెస్తే, అవన్నీ పోయి నోరు చాలా శుభ్రంగా అవుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు రోజుకు 3 సార్లు ఉప్పు నీటిని గొంతులో పోసుకొని పుక్కిలించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్త స్రావం అయ్యేవారు, పంటి నొప్పితో బాధపడే వారికి అద్భుత ప్రయోజనాలు కలిగిస్తుంది. బాక్టిరియాలు, వైరస్ లు చేరడం వలన గొంతులో ఉన్న టాన్సిల్స్ వాపునకు గురవుతాయి. ఆహారం తినాలన్నా, ద్రవాలను తాగాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది, ఉప్పు నీటిని గొంతులో పోసుకొని పుక్కిలించడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Related News