భారీగా తగ్గిన బంగారం ధర.. త్వరపడండి!!

www.mannamweb.com


భారీగా తగ్గిన బంగారం ధర.. త్వరపడండి!!

బడ్జెట్ ముందు వరకు బంగారం వంక చూడాలంటేనే భయపడిన ప్రజలు ఇప్పుడు ఒకసారిగా బంగారం మీద దృష్టి కేంద్రీకరించారు. అందుకు కారణం బంగారం ధరలు వరుసగా తగ్గుతూ రావడం.

ప్రస్తుతం గోల్డ్ లవర్స్ కు బంగారం లాంటి వార్త చెప్పింది బులియన్ మార్కెట్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి.

గోల్డ్ లవర్స్ కు బంపర్ న్యూస్

బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 950 రూపాయలు తగ్గగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఒక వెయ్యి 40 రూపాయలు తగ్గడం నిజంగా గోల్డ్ లవర్స్ కు బంపర్ న్యూస్. నేడు భారతదేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 64000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 69,820 గా ఉంది.

భారీగా తగ్గిన బంగారం

కచ్చితంగా వారం రోజుల్లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పైన దాదాపు 5000రూపాయలు తగ్గడం విశేషంగా చెప్పొచ్చు.బంగారం కొనుగోలు చేయాలనుకునే గోల్డ్ లవర్స్ కు బంగారం కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 64,150 రూపాయలు గా ఉంది.

10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో 69,950గా నేడు కొనసాగుతుంది.

ముంబై, చెన్నైలలో బంగారం ధరలిలా

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 64000గా విక్రయించబడుతుంటే, 24క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 69,820గా నేడు కొనసాగుతుంది.నేడు చెన్నైలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 64300 కాగా 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర చెన్నైలో 70,150 రూపాయలుగా ఉంది. చెన్నైలో కేవలం 10గ్రాముల 22క్యారెట్ల బంగారానికి 600రూపాయలు, 10గ్రాముల 24క్యారెట్ల బంగారానికి 650 రూపాయలు మాత్రమే తగ్గింది.

హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలిలా

హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 64000 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో 69,820గా నేడు కొనసాగుతుంది ఇక విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 64000, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 69,820 రూపాయలుగా ఉంది.

బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం

బంగారం కొనుగోలు చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అని చెబుతున్నారు. గత ఎనిమిది రోజులుగా 5000 రూపాయలు బంగారం పైన తగ్గడం నిజంగా బంగారం లాంటి వార్త కాకపోతే మరేంటి.