తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు! ఏయే జిల్లాల్లో వానలు, ఎప్పుడంటే

ఉక్కపోతతోఅల్లాడిపోతున్న జనాలకు కాస్త ఉపశమనం లభించనుంది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని ఐఎండీ చెబుతోంది.


వర్షాలతోపాటు ఈదురుగాలులువీస్తాయని పేర్కొంది.

తెలంగాణలో వాతావరణం:-

తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉంటే శుక్ర, శనివారాల్లో మరికొన్ని జిల్లాలపై వర్షాల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. వాతావరణ శాఖ చెప్పినట్టుగా వర్షాలు కురిసే జిల్లాలు ఇవే

గురువారం వర్షం పడే జిల్లాలు:- నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లా

శుక్రవారం వర్షాలు కురిసే జిల్లాలు :- నల్గొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణ్పేట, గద్వాల్

శని వారం వర్షం పడే జిల్లాలు :- ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నాగర్ కర్నూల్

ఆంధ్రప్రదేశ్లో వాతావరణం:

ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు రోజుల పాటు వర్షాల కురుస్తాయి. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు అనంతపురం, సత్యసాయి,కడప, అన్నమయ్య జిల్లాల్లో..

మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు,పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.