రానున్న ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఉరుములు, పిడుగులతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
మరోవైపు రాయలసీమ, కోస్తాంధ్రాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
































