ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

www.mannamweb.com


బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమొరిన్ ప్రాంతం వరకు వ్యాపించి ఉంది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవరించి ఉన్న ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో సోమ, మంగళ, బుధ వారాల్లో – తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగముతో బలమైన గాలులుకూడా వీస్తాయని తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, రాయలసీమలోనూ సోమ, మంగళ, బుధ వారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతోపాటు బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.