తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్ర కూడా కీలక ప్రకటన జారీ చేసింది.. ఆగస్టు 29వ తేదీ కల్లా తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతములో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అంచనా వేసింది.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఏపీలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :- సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
రాయలసీమ:- సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది..