పండగ సీజన్‌లో భాగంగా ప్రతీ ఏడాది నిర్వహించే బిగ్ బిలియన్ డేస్‌ను ఈసారి నిర్వహించేందుకు ఫ్లిప్ కార్ట్ సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది.
ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, గృహోపకరణల వరకు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 26 నుంచి) సేల్ ప్రారంభం కానుంది.
సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ డీల్స్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయిప్పటికీ.. కొన్ని లీక్స్ వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం సేల్‌లో భాగంగా ఏయే ఫోన్‌లపై ఎంత డిస్కౌంట్ లభించనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లిప్ కార్ట్ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్8, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్స్ లభించనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ మంచి డిస్కౌంట్ అందించనుంది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 30 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 75,999కాగా సేల్‌లో భాగంగా రూ. 40వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇక గ్యాలక్సీ ఎస్23పై కూడా భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40 వేలలోపు అందుబాటులోకి రానుంది.
ఇక పోకో ఎక్స్6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌ను రూ. 20వేలలోపే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు సీఎంఎఫ్ ఫోన్1, నథింగ్ ఫోన్2ఏ, పోకో ఎం6 ప్లస్, వివో టీ3ఎక్స్, ఇన్ఫినిక్స్ నోట్40 ప్రో వంటి మొబైల్స్‌పై కూడా కళ్లు చెదిరే డిస్కౌంట్స్ అందించనున్నారు. ఇక ఈ సేల్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా డిస్కౌంట్‌ను అందించనున్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుదారులకు ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందించనున్నారు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యూపీఐ చెల్లింపులతో రూ. 50 డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా రూ. లక్ష వరకు రుణం పొందో అవకాశం కల్పించారు. అలాగే ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపైనా నో- కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను అందించారు.