వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో హీరో బాలకృష్ణ

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌(World Book of Records)లో హీరో బాలకృష్ణ(Hero Balakrishna) పేరు నమోదు అయింది. యూకేకు చెందిన సంస్థ ఆయన పేరును గోల్డ్ ఎడిషన్‌(Gold Edition)లో చేర్చింది.


50 ఏళ్ల పాటు హీరోగా నటించినందుకు బాలకృష్ణకు గుర్తింపు దక్కింది.

కాగా హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇటీవల 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ 50 ఏళ్ల కాలంలో ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలు చేశారు. బాలనటుడిగా నందమూరి బాలకృష్ణ కొన్ని సినిమాల్లో నటించారు. తాతమ్మ కలతో ఆయన సినిమాల్లోకి తెరంగేట్రం చేశారు. తెలుగులో పౌరాణికం, ఫిక్షన్‌తో పాటు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో నటించి అరుదైన రికార్డు సాధించారు. ఈ మధ్యనే ఆయనకు కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు కూడా బాలకృష్ణ ఎక్కారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రాజకీయ నాయకుడిగా కూడా బాలయ్యకు రికార్డు చరిత్రే ఉంది. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.