హీరో రాజేష్ చనిపోవడంతో ఎన్ని కష్టాలు, అవమానాలు పడుతూ రాజేష్ భార్య కూతుర్ని హీరోయిన్ గా చేసిందో తెలుసా

www.mannamweb.com


తెలుగులో హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్ అందరికీ తెలిసే ఉంటుంది. నటిగా ఈమె మంచి గుర్తింపును సంపాదించుకుంది.

అయితే ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ కూడా తెలుగులో గొప్ప నటుడు అన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. నటుడు రాజేష్ తెలుగులో మల్లె మొగ్గలు, రెండు జెళ్ళ సీత, ఆనంద భైరవి వంటి సినిమాలలో నటించారు. రాజేష్ తెలుగులో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఐశ్వర్య రాజేష్ తాతయ్య అమర్నాథ్ కూడా నటన రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అమర్నాథ్ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశారు. ఇక ఐశ్వర్య రాజేష్ మేనత్త శ్రీలక్ష్మి హాస్యనటిగా 500 కు పైగా సినిమాలలో నటించి బాగా మెప్పించారు. అప్పట్లో ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చారు. ఇక అప్పటినుండి ఐశ్వర్య రాజేష్ చెన్నైలోనే తన కుటుంబంతో ఉంటున్నారు. ఐశ్వర్య తండ్రి హీరోగా నటిస్తున్నప్పటికీ ఐశ్వర్య రాజేష్ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందంట. నటుడు రాజేష్ ఒక సినిమాలో నటించిన వచ్చిన డబ్బులను దానధర్మాలకు ఇవ్వవలసి వచ్చేదట. ఎవరో ఒకరు వచ్చి రాజేష్ కి డబ్బులు ఇవ్వమని అడగడంతో వచ్చిన వారికి కాదనలేక నటుడు రాజేష్ సాయం చేసేవారట. ఐశ్వర్య తల్లి కూడా మంచి వ్యక్తి కావడంతో ఈమె కూడా దానధర్మాలు చేసేదట. ఇక లక్షల రూపాయలు సూరిటీ ఉండి కూడా ఐశ్వర్య తల్లిదండ్రులు ఇతరులకు డబ్బులు ఇప్పించేవారట. ఇలా ఆలోచించకుండా అందరికీ సహాయం చేసి ఉన్న కొన్ని డబ్బులు పోగొట్టుకున్నారు. అలాగే తాగుడుకు అలవాటైన రాజేష్ తన ఆరోగ్యం మొత్తం నాశనం చేసుకున్నారు.

దాంతో ఐశ్వర్య తల్లి ఐశ్వర్యతో పాటు ముగ్గురు అన్నయ్యలను పెంచడానికి ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసేవారట. ఐశ్వర్య తల్లి ఆర్థిక భారంతో మానసికంగా మరియు శారీరకంగా కృంగిపోయినప్పటికీ తన భర్తను బ్రతికించుకోవడం కోసం ఖరీదైన వైద్యం చేయించేవారట. కానీ చివరకు రాజేష్ లివర్ చెడిపోవడంతో చనిపోవడం జరిగింది. తండ్రి చనిపోయిన సమయంలో ఐశ్వర్య రాజేష్ వయస్సు కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే. అయితే అప్పట్లో వీరికి ఒక ఫ్లాట్ ఉండేదట. కానీ సూరిటీ కింద డబ్బులు తీసుకున్న వాళ్ళు ఆ అప్పును చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వాళ్ళు ఆ ఫ్లాట్ ను ఆక్రమించుకున్నారట. దాంతో కుటుంబం మొత్తం అదే ఇంట్లో తలదాచుకున్నారట. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి రాజేష్ భార్య తన పిల్లలను బాగా చదివించి పెద్దవాళ్ళను చేశారు. కానీ దురదృష్టవశాత్తు చేతికి వచ్చిన ఇద్దరు పెద్ద కుమారులు కూడా మరణించారు.

చేతికి వచ్చిన ఇద్దరు కొడుకులు తన కళ్ళ ముందే చనిపోవడంతో ఐశ్వర్య రాజేష్ తల్లి మంచానికే పరిమితమయ్యారు. దాంతో కుటుంబ బాధ్యత పూర్తిగా ఐశ్వర్య రాజేష్ మీద ఉండడంతో ఆమె సీరియల్స్ లో నటించడానికి రెడీ అయ్యారు. సీరియల్ లో రోజుకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నటించినందుకు ఆమెకు 500 రూపాయలు ఇచ్చేవారట. కానీ ఇల్లు గడవడానికి ఆ డబ్బులు సరిపోక సినిమాల్లో అయితే మంచి సంపాదన వస్తుందని భావించిన ఐశ్వర్య రాజేష్ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కలర్ బాగాలేదని, భాష బాగాలేదని చాలామంది అవమానించిన ఏమాత్రం పట్టించుకోకుండా పట్టుదలతో చివరకు హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ సినిమాలో నటించారు.