హీరో సుమన్ పరిస్థితి చూసి చలించిన సీఎం…ఏం చేసారంటే.?

www.mannamweb.com


టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోలతో పోటీ పడిన హీరో సుమన్.. తన గ్లామర్ నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సుమన్ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూకట్టేవారు.
చిరంజీవి లాంటి హీరోతో సుమన్ కు పోటీ ఉండేది. కరాటే లో బ్లాక్ బెల్ట్ అందంలో ఆకట్టుకునే విధంగా ఉండటంతో సుమన్ అతితక్కువకాలంలో తనకంటూ మంచి గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు. 1959, ఆగస్టు 28న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన సుమన్.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150 సినిమాలకు పైగా హీరోగా నటించారు. తెలుగులో హీరోల్లో మొట్టమొదటిగా కరాటే బెల్ట్ సాధించింది ఆయనే.ఇక స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో సుమన్ ఇంటిపై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. హీరో సుమన్ ని బ్లూ ఫిల్మ్స్ ఇష్యూలో అరెస్టు చేశారు. అప్పట్లో ఈ వార్తా సంచలనంగా మారింది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఎవరు ఇందంతా చేస్తున్నారో సుమన్ కు ఏమీ అర్థం కాలేదు. ఆ కేసు నుండి బయటపడటానికి సుమన్ కు చాలా రోజులు పట్టింది. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు. ప్రముఖ హీరోపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆ కేసు వల్ల సుమన్ జైలు జీవితాన్ని గడిపారు.అయితే గతంలో సుమన్ ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. అమ్మాయిలను వేధించినట్టు బ్లూ ఫిల్మ్ లు తీసినట్టు ఆరోపించి కేసులు వేశారని చెప్పారు. యాంటి గుండా యాక్ట్, ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం వల్ల తనకు బెయిల్ కూడా దొరకలేదని చెప్పారు. ఆధారాలు అడిగితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పేవారని అన్నారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడానికి తన వద్ద సమాధానం లేదని అన్నారు. పోలీసుల దగ్గర కూడా సమాధానం లేదని అన్నారు. తనను సైదాబాద్ కోర్టులో హాజరుపరిచారని అన్నారు. ఆ తర్వాత మద్రాస్ జైలుకి తరలిచినట్లు పైగా సాధారణ ఖైదులు ఉండే గదులు కాకుండా అత్యంత ప్రమాదకర టెర్రరిస్టులు ఉండే గదుల్లో వేశారన్నారు.1985 మే నెలలో సుమన్ జీవితంలో మరిచిపోలేని సంఘటనలు జరిగాయి. ఏం జరుగుతుందో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో అర్థం కాని స్థితిలో ఉండిపోయారు. జైలులో తనకు తానే ధైర్యం చెప్పుకున్నానని చెప్పుకొచ్చారు. ఓసారి కరుణానిధి గారు వచ్చి తన పరిస్థితి చలించిపోయారని అన్నారు.

జైలు అధికారులను హెచ్చరించి తనను వేరే గదికి మార్పించారని చెప్పారు. ఇదిలా ఉండగా తనపై ఓ జరిగిన ఓ పొలిటికల్ కుట్ర వల్లే జైలు జీవితంy అనుభవించాల్సి వచ్చిందన్నారు. సుమన్ వాళ్ల అమ్మగారు న్యాయపోరాటం చేసిందిన్నారు.అయితే హీరోయిన్స్ సుమలత, సుహాసిని తనకు మద్దతు తెలిపినట్లు తెలిపారు. అంతకు మించి ఇండస్ట్రీలో ఎవరూ పట్టిచుకోలేదని చెప్పుకొచ్చారు. కొడుకు విడుదల కోసం సుమన్ తల్లి చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు పెరిగింది. దేశంలోనే ప్రముఖ న్యాయవాదులైన రాంజెఠ్మలానీ, సోలీ సొరాబ్జీ వంటి లాయర్ల గైడెన్స్‌తో తమిళనాడుకు చెందిన రామస్వామి అనే లాయర్ కోర్టులో గట్టిగా వాదించి సుమన్‌కు బెయిల్ మంజూరయ్యేలా చేశారని చెప్పారు. దాదాపు ఐదు నెలల తర్వాత జైలు జీవితం నుంచి స్వేచ్చ వాయువులు పీల్చుకున్నట్లు తెలిపారు.ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో హీరోగా సుమన్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయింది. చివరికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా మునుపటి క్రేజ్‌ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సినీ ఇండస్ట్రీలో కొనసాగారు.