రాజకీయాల్లోకి హీరో సుమన్ ఎంట్రీ..ఆ పార్టీ తరుపున MLA గా పోటీ?

ఒకప్పుడు హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి దాదాపుగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి పోటీ కి ఇచ్చిన నటుడు సుమన్(Actor Suman).


తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో హీరో గా నటిస్తూ ఒక సునామీ లాగా దూసుకొచ్చాడు. అలాంటి సమయం లో అతని జీవితం లో జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు కారణంగా కెరీర్ లేకుండా పోయింది. జైలు నుండి బయటకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో హీరో గా నటించాడు కానీ, అవి కమర్షియల్ గా ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. కానీ అక్కడితోనే ఆగిపోకుండా హీరో గా మార్కెట్ పోయినప్పటికీ క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే ఉన్నాడు. అయితే సుమన్ కి చాలా కాలం నుండి రాజకీయాలపై మక్కువ ఉంది. సరైన సమయం చూసి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు.

ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సుమన్ మాట్లాడుతూ ‘నాకు తమిళనాడు లో ప్రధాన రాజకీయ పార్టీల నుండి MLA టికెట్ ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను చేయలేదు. రాబోయే ఎన్నికల్లో ఈసారి ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. నేను పుట్టిపెరిగింది చెన్నై లోనే, నన్ను ఇంతటి వాడిని చేసింది తమిళ ఆడియన్స్. కచ్చితంగా నేను తమిళనాడు రాజకీయాల్లోనే అడుగుపెడుతాను. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆంధ్ర ప్రదేశ్ లో సుమన్ ఒక్క రాజకీయ పార్టీ కి కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపలేదు. జగన్ ని మెచ్చుకున్నా సందర్భాలు ఉన్నాయి, చంద్రబాబు ని పొగిడిన సందర్భాలు ఉన్నాయి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా ఎన్నోసార్లు గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తాను ఒక పార్టీ కి కానీ, ఒక వర్గానికి కానీ చెందినవాడని కాదని ఆయన చెప్పకనే చెప్పాడు.

ఒకవేళ ఆయన ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చెయ్యాలని అనుకుంటే అన్ని రాజకీయ పార్టీల నుండి ఆహ్వానం అందుతుంది. కానీ ఆయన తమిళనాడు రాజకీయాల్లో యాక్టీవ్ అవ్వాలని అనుకుంటున్నాడు కాబట్టి, ఇప్పుడు ఆయన ఏ పార్టీ లోకి వెళ్లబోతున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గానే తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్ TVK అనే పార్టీ ని స్థాపించాడు. సుమన్ ఆ పార్టీ లోకి వెళ్లి పోటీ చేస్తాడా?, లేదా ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి DMK , అన్నా DMK లో చేరుతాడా?, ఇవి రెండు కాకుండా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీ లో చేరుతాడా అనేది తెలియాల్సి ఉంది. విజయ్ TVK కొత్త పార్టీ కాబట్టి ఆయనకు MLA సీట్ చాలా సులువుగా వస్తుంది. కాబట్టి ఆయన సాధ్యమైనంత వరకు TVK లో చేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.