ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలపై లోకేష్ స్పందన

www.mannamweb.com


కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. విద్యార్థినుల ఆందోళనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నానని… హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.‌

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. విద్యార్థినుల ఆందోళనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నానని… హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.‌ ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చానన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని లోకేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

చంద్రబాబు సీరియస్

మరోవైపు విద్యార్థినుల హాస్టల్‌లోని వాష్ రూమ్స్‌లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయిలో దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో హిడెన్ కెమేరాలు ఉన్నాయనే అంశంపై తక్షణ విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.

కాగా.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనను విరమింపజేశారు. బాలికల హాస్టల్ వాష్ రూమ్‌లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వియ్ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిలు నినాదాలు చేశారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై… తోటి విద్యార్థులు దాడికి యత్నించారు. విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్‌కు పోలీసులు చేరుకున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల వరకూ ఇంజినీరింగ్ కళాశాలలో ఆందోళన కొనసాగింది. ఫైనల్ ఇయర్ విద్యార్థికి.. మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ విద్యార్థులంతా ఆరోపిస్తున్నారు.