పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో ట్విస్ట్- ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం

పీలో తీవ్ర కలకలం రేపిన పాస్టర్ ప్రవీణ్ అనుమాస్పద మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురై చనిపోయారంటూ పోలీసులు చేసిన దర్యాప్తులో ఇప్పటికే తేలింది.


అయితే దీనిపై పలు క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వాన్ని మరోసారి దర్యాప్తు చేయించాలని కోరాయి. అయితే ప్రభుత్వం దీన్ని తోసిపుచ్చడంతో కేఏ పాల్, హర్షకుమార్ తో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు.

పాస్టర్ ప్రవీణ్ మృతిపై మరోసారి సీబీఐతో మరోసారి దర్యాప్తు చేయించాలని కేఏ పాల్, హైకోర్టు జడ్జితో దర్యాప్తు చేయించాలంటూ హర్షకుమార్ దాఖలు చేసిన పిటిషన్లపై తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేశారని, ఇందులో ఎలాంటి లోటుపాట్లు లేవని హైకోర్టుకు తెలిపింది. అయితే పిటిషనర్లు మాత్రం దర్యాప్తులో పలు లోపాలు ఉన్నట్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు పోలీసుల దర్యాప్తు వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే పాస్టర్ ప్రవీణ్ కేసు దర్యాప్తులో పొరబాట్లు జరిగాయా అని కూడా అడిగింది.

దీంతో ప్రభుత్వ న్యాయవాది పాస్టర్ ప్రవీణ్ కేసు దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేవని తెలిపారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రికి వచ్చే దారిలో పలు చోట్ల మద్యం కొనుగోలు చేసినట్లు, మద్యం సేవించినట్లు, రోడ్డు పక్కనే పడిపోయినట్లు ఆధారాలు ఉన్నట్లు హైకోర్టుకు తెలిపారు. అలాగే ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేయడం లేదన్నారు. దీంతో హైకోర్టు పూర్తి దర్యాప్తు వివరాలు ఇవ్వాలని కోరుతూ విచారణను వాయిదా వేసింది.

ఈ కేసులో పిటిషనర్లుగా ఉన్న కేఏ పాల్, హర్షకుమార్ సదుద్దేశంతోనే ఈ ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలు చేసినట్లు నిరూపించుకోవడానికి తలో 5 లక్షలు కోర్టులో జమ చేయాలని గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఇందులో తాను 5 లక్షలు జమ చేసేందుకు సమయం ఇవ్వాలని హర్షకుమార్ కోర్టును కోరగా అంగీకరించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.