అనంతపురం జిల్లా తాడిపత్రి(Tadipatri)లో హైడ్రామా నెలకొంది. తాడిపత్రి జనసేన ఇంచార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి(Tadipatri Janasena incharge Kadiri Srikanth Reddy)ని శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కొద్దిసేపటికే విడుదల చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ నుంచి ఆయన ఇంటికి వెళ్లిపోయారు.
తాడిపత్రిలో శుక్రవారం పోలీసులపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేశారు. పోలీసులు దొంగలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు శనివారం ఉదయం శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. విమర్శలపై వివరణ ఇవ్వాలని అడిగారు. దీంతో ఆగ్రహించిన శ్రీకాంత్ రెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఈ మేరకు ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే వెంటనే విడుదల చేశారు. దీంతో ”అసలు శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు?, ఎందుకు వదిలిపెట్టారు?., పోలీసులపై విమర్శలు చేసినందుకు కేసు నమోదు చేశారా.. లేదా?, అందుకే ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారా..?. అసలు పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగింది?, శ్రీకాంత్ చేసిన విమర్శలపై ఏం చెప్పారు..?. పోలీసులు ఎందుకు విడిచిపెట్టారు?.” అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. పోలీసులు క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు.