అతని యూట్యూబ్ సంపాదన రూ.8,300 కోట్లు… ఇంతకీ ఏం చేస్తాడంటే?

నేటి కాలంలో యూట్యూబ్ ద్వారా సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేసి సక్సెస్ కావాలని అనుకున్న వారిలో కొంతమంది మాత్రమే విజేతగా నిలుస్తారు.


అంకిత భావం, పట్టుదల, తీవ్రమైన శ్రమ ఉంటేనే ఇందులో రాణిస్తారు. అలా చాలా కష్టపడినా ఓ కుర్రాడు యూట్యూబ్లో నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్లారు. అతని సంపాదన ప్రస్తుతం వన్ బిలియన్ డాలర్. అంటే సుమారు రూ. 8,300 కోట్లు. 400 మిలియన్ సబ్స్క్రైబర్లు కలిగిన అతని ఛానల్ నెంబర్ వన్ కావడానికి కారణమేమిటి? ఇంతకీ అతను ఎవరు?

అయితే జిమ్మీ డొనాల్డ్సన్ అనే కుర్రాడు యూట్యూబ్లో సంచలనం సృష్టించాడు. అందరిలాగే ఇతను కూడా యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేశాడు. కానీ అందరికంటే నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్ళాడు. 2012 సంవత్సరంలో యూట్యూబ్ ప్రారంభించిన ఈయన అప్పటి వయసు 13 సంవత్సరాలు మాత్రమే.. ముందుగా మైండ్ క్రాఫ్ట్ వంటి ఆన్లైన్ గేమ్ వీడియోతో ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత విభిన్న ఆలోచనలతో కలిగిన వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించాడు. క్రియేటివిటినే ఆయుధంగా మార్చుకున్న ఆయన రెండుకు తగ్గట్టుగా వీడియోలను పోస్ట్ చేసి వీక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా 2017 లో చేసిన ఓ వీడియో సంచలనం సృష్టించింది. వాస్తవానికి ఈ వీడియో చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఇందులో ఆయన ఒకటి నుంచి లక్ష వరకు అంకెలు లెక్క పెట్టాడు. అయితే ఈ వీడియో ఏముంది? అనే క్వశ్చన్ తోనే ఇది పాపులర్ అయింది. ఇలా వింత వింత వీడియోలు తీస్తూ ఆకట్టుకుంటూ వ్యూస్ ను పెంచుకున్నాడు.

సాధారణంగా ఒక వీడియో పోస్ట్ చేయగానే అతని అదృష్టం కొద్దీ వ్యూస్ వచ్చాయి అంటే పొరపాటే. ఎందుకంటే ఒక వీడియో పోస్ట్ చేయడానికి జిమ్మీ ఎంతో కష్టపడతాడు. ముఖ్యంగా ఖరీదైన ప్రొడక్షన్ వాల్యూ తో వీడియో తీస్తాడు. ఇందులో ఖరీదైన కెమెరా వాడుతూ ఉంటాడు. అలాగే నిత్యం పోస్ట్ చేస్తూనే ఉంటాడు. క్రమం తప్పకుండా వీడియోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటాడు. కాలేజీ చదువును మధ్యలోనే మానివేసి యూట్యూబ్లో వీడియోలను పోస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్న ఈయన squid game లో అన్ని రిక్రియేట్ చేసి షో తరహా లోనే గేమ్స్ నిర్వహించేవాడు. దీనికి ఆయన 25 కోట్ల రూపాయల ఖర్చు చేశాడు. అంతేకాకుండా విజేతకు 40 లక్షల ప్రైజ్ మనీ కూడా ఇచ్చాడు. ఈ వీడియో అతని జీవితంలోనే గొప్ప వీడియో గా నిలిచింది. దీనికి 680 బిలియన్స్ న్యూస్ వచ్చాయి. అంటే ఈ ఒక్క వీడియో మీదే అతనికి వచ్చాయి.

అయితే జిమ్మీకి వచ్చే సంపాదన అతను తన సొంత వాడుకోడు.. కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. 23 మిలియన్ల డాలర్లు సేకరించిన ఆయన 23 మిలియన్ల మొక్కలను నాటించాడు. అలాగే ఎంతోమంది పేదలకు ఇల్లు కట్టించాడు. కొంతమంది విద్యార్థులకు డబ్బు సహాయం చేశాడు. తరగతి గదులను కూడా కట్టించిన ఆయన 30 ఏళ్ల వయసులోనే కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.