నోటు పై గాంధీ గారి బొమ్మ ఎలా వచ్చిందో తెలుసా…ఎన్నో గాంధీగారి చిత్రాలు ఉండగా….ఆ ఒక్క ఫోటోనే ముద్రిస్తారు దేనికి… అసలు ఆ ఫోటో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు తీశారంటే

History Behind Mahatma Gandhi Picture On Indian Currency Notes


మీకెప్పుడైనా మన కరెన్సీ నోట్ల పై గాంధీజీ బొమ్మ ఎందుకు ఉంది అనే అనుమానం వచ్చిందా ? గాంధీజీ బొమ్మను మాత్రమే అన్ని నోట్ల పై ఎందుకు ముద్రించారో తెలుసా ?
దాని వెనుక ఓ చరిత్ర దాగి ఉంది. అసలు గాంధీజీ బొమ్మనే అన్ని కరెన్సీ నోట్ల పై ఎందుకు ముద్రించ వలసి వచ్చింది. అది కూడా గాంధీ నవ్వుతున్న ఆ ఒక్క బోమ్మనే ఎందుకు ముద్రించారో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు కల్మషం అనేదే లేకుండా ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో నవ్వుతున్న ఆ గాంధీ బొమ్మ ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే మీరు నిజం గా ఆశ్చర్య పోతారు. ఒక సరైన ప్రయోజనం కోసం, అంత పరిపూర్ణంగా, ఎంతో ముగ్దమనోహరంగా ఉన్న గాంధీ బొమ్మ ఎలా లభించింది?

గాంధీజీ వి ఎన్నో బొమ్మలు ఉండగా , ఆ ఒక్క బొమ్మని ఎందుకు అన్ని కరెన్సీ నోట్ల పై వాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ ఫోటోను ఎవరు తీశారంటే :
1946 వ సంవత్సరంలో ఒక గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ గాంధీ గారి బొమ్మని తన కెమెరా లో బంధించాడు. కోల్ కత్తా లోని వైస్రాయ్ భవంతి లో, అప్పట్లో బ్రిటీష్ సెక్రటరీ అయిన లార్డ్ పతిక్ లారెన్స్ అనే వ్యక్తిని మహాత్మా గాంధీ 1946 వ సంవత్సరంలో కలవడానికి వెళ్లారు. ఆ సమయంలో ఈ ఫోటో తీసారట.

ఆ చిత్రం గురించి మరిన్ని విశేషాలు :
ఆ ప్రత్యేక చిత్రాన్ని ఒకప్పుడు, అంటే 1946 లో వైస్రాయ్ భవనం గా ప్రసిద్ధి గాంచిన ప్రదేశం నుండి తీసుకున్నారు. దానినే ఇప్పుడు రాష్ట్రపతి భవనంగా పరిగణిస్తున్నాం. ఈ ఇతిహాస గాంధీ చిత్రాన్ని మన కరెన్సీ నోట్ల పై ముద్రించడానికి అనుగుణంగా మార్చుకొని మన నోట్ల పై ముద్రించడం ప్రారంభించారు.
ఆ ప్రతిబింబ చిత్రాన్ని మొదట అప్పుడు వాడారు :
మహాత్మా గాంధీ యొక్క అసలు బొమ్మకు ప్రతిబింబ చిత్రాన్ని 1987 లో ముద్రించిన ఐదు వందల రూపాయల నోట్ల పై మొట్ట మొదటి సారిగా వాడారు. ఆ నోట్ల పై గాంధీ జీ చిత్రాన్ని నీటిగుర్తు గా వాడారు. ఆ నోట్లని గాంధీ శ్రేణి నోట్ల గా పిలవడం ప్రారంభించారు.

ఇండియన్ కరెన్సీ గురించి మీకు తెలియని కొన్ని సర్ ప్రైజింగ్ విషయాలు..!!

1996 లో నోట్లు రూపాంతరం చెందాయి :
గాంధీ జీ బొమ్మని ముద్రించబడ్డ కరెన్సీ నోట్లు 1996 వ సంవత్సరం నుండి చలామణిలోకి వచ్చాయి. అంతక ముందు నోట్ల పై అశోక స్తంభాన్ని ముద్రించేవారు. రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా నోట్లను రూపాంతరం చేయాలని భావించి ఇక అప్పటి నుండి ఐదు రూపాయల నోటు మొదలు కొని వెయ్యి రూపాయిల నోటు వరకు గాంధీ జీ చిత్రాన్ని వ్యాపార చిహ్నంగా ముద్రించడం ప్రారంభించింది.

ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు గాంధీ జీ చిత్రాన్ని అన్ని భారతీయ కరెన్సీ నోట్ల పై ముద్రించ బడుతూనే ఉంది..