ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్‌ఎండీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా హెచ్ఎండీ క్రెస్ట్, హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ 5జీ పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది ఈ ఫోన్‌లను మొత్తం మూడు కలర్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు.
ఫీచర్ల విషయానొకిస్తే వీటిలో 6.67 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ రెండు ఫోన్స్‌లోనూ 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తాయి.
ఈ ఫోన్‌లు ఆక్టాకోర్ 6 ఎన్‌ఎం యూనిసోక్ టీ760 ప్రాసెసర్‌ను అందించారు. హెచ్‌ఎండీ క్రెస్ట్ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో, క్రెస్ట్ మ్యాక్స్‌ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తీసుకొస్తున్నారు.
కెమెరా విషయానికొస్తే.. హెచ్ఎండీ క్రెస్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్తో కూడిన ఏఐ కెమెరాను అందించారు. ఇక హెచ్‌ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ 5జీ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు వీటితో పాటు 5-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా సెన్సర్ కెమెరాలను ఇచ్చారు. రెండు ఫోన్స్‌లోనూ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
హెచ్‌ఎండీ క్రెస్ట్ ఫోన్ ధర రూ. 12,999కాగా, హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ ధర రూ.14,999గా నిర్ణయించారు. హెచ్ఎండీ క్రెస్ట్ ఫోన్ మిడ్ నైట్ బ్లూ, లుష్ లిలాక్, రాయల్ పింక్ కలర్ ఆప్షన్లలోనూ, హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ ఆక్వా గ్రీన్, డీప్ పర్పుల్, రాయల్ పింక్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఆగస్టు నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.