బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ రెడీ..! గంజాయి బ్యాచ్‌ ఆస్తులు సీజ్‌.. హోం మంత్రి వార్నింగ్..

www.mannamweb.com


బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోందన్నారు ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ..

గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.. బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోంది.. యాంటీ నార్కొటిక్ టీంను ఏర్పాటు చేశాం.. అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అన్నారు.. రౌడీషీట్లు, పీడీ యాక్ట్ కూడా పెడతాం అని వెల్లడించారు.. ఏజెన్సీల్లో పండే గంజాయి స్కూల్‌ బ్యాగుల్లోకి వచ్చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు.. గంజాయి నిర్మూలనకు చెక్ పోస్టులు పెంచాం.. సీసీ కెమెరాలు పెంచాం.. 25 వేల కేజీల గంజాయి సీజ్ చేసాం.. 916 మంది మీద కేసులు పెట్టామని వివరించారు.

Delhi Air Pollution: దేశంలోనే అత్యంత కలుషితమైన నగరం ఢిల్లీనే..

గంజాయి బ్యాచ్‌ వారి ఆస్తులు, ఐడెంటిటీలు సీజ్ చేస్తాం అని హెచ్చరించారు హోం మంత్రి అనిత.. డీ అడిక్షన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశామని వివరించారు.. ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి సర్వాధికారాలు ఇచ్చాం.. రాజమండ్రి, విజయవాడ దగ్గర ఎక్కువగా బ్లేడ్ బ్యాచ్‌లను గుర్తించాం.. కడపలో బ్లేడ్ బ్యాచ్ ల అంశం మా దృష్టికి తెచ్చారు గనుక.. అక్కడ కూడా పని చేస్తాం అన్నారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. కాగా, గత ఐదేళ్ల సమయంలోనే ఏపీ గంజాయి బ్యాచ్‌.. ఆ తర్వాత బ్లేడ్‌ బ్యాచ్‌ కోరల్లో చిక్కుకుపోయిందని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌.. గత ప్రభుత్వ హయాంలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోలేదు.. కనీసం ఆ సమయంలో హోంశాఖ మంత్రి రివ్యూలు చేసిన సందర్భాలు కూడా లేవన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్‌..