ప్రస్తుతం హోండా కార్స్ అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి కార్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హెూండా అమేజ్ జెడ్‌ఎక్స్ ట్రిమ్ పై రూ. 1.26 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది.
ఎస్ ట్రిమ్ రూ. 96,000 తగ్గింపుతో లభిస్తుండగా, అమేజ్ ఈ రూ. 86,000 తగ్గింపును అందిస్తున్నారు. హెూండా సిటీకు సంబంధించిన జెడ్ఎక్స్ ట్రిమ్ రూ. 1.07 లక్షల తగ్గింపుతో లభిస్తుంది. అయితే ప్రీమియం సెడాన్ యొక్క ఇతర ట్రిమ్‌లు రూ. 92,000 వరకు ప్రయోజనాలను అందిస్తాయి. సిటీ ఈ హెచ్ఈవీ కూడా రూ. 65,000 వరకు ఇయర్ ఎండ్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. భారతదేశంలో హెూండాకు సంబంధిచిన ఫ్లాగ్లిప్ ఉత్పత్తి అయిన ఎలివేట్ ఎస్‌యూవీ జెడ్ ఎక్స్ ట్రిమ్ పై రూ. 86,000 తగ్గింపును అందిస్తుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీకు సంబంధించిన ఎస్‌వీ, వీ, జెడ్ ట్రిమ్స్‌పై రూ.76,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
హెూండా అమేజ్ భారతదేశంలో రూ. 7.19 లక్షల నుంచి రూ. 9.95 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. హోండా సిటీ రూ. 11.82 లక్షల నుండి రూ. 16.35 లక్షల (ఎక్స్-షోరూమ్), సిటీ ఈహెచ్‌వీ రూ. 19 లక్షల నుండి రూ. 20.55 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉన్నాయి. హెూండా ఎలివేట్ ధరలు రూ. 11.69 లక్షల నుంచి ప్రారంభమై రూ. 16.43 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
హెూండా అమేజ్‌ను భారతదేశంలో పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. బ్రాండ్ ఇటీవలే సబ్ కాంపాక్ట్ సెడాన్‌కు సంబంధించిన కొత్త వెర్షన్ డిజైన్ స్కెచ్‌లను షేర్ చేసింది. కొత్త అకార్డ్, సివిక్, సిటీ వంటి బిగ్ సెడాన్లు హెూండా లైనప్‌లనుకొత్త అమేజ్ డిజైన్ తలపించేలా ఉంది. 2024 అమేజ్ ఇంటీరియర్ కూడా సవరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కొత్త లేఅవుట్ ఉంటుంది. హోండా అమేజ్ లేటెస్ట్ వెర్షన్ కొన్ని నెలల్లోనే భారతదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.