హానర్​ మ్యాజిక్​ 6 ప్రో లాంచ్​- ఫీచర్స్​, ధర వివరాలివే.

www.mannamweb.com


స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3, 5,600 ఎంఏహెచ్ బ్యాటరీతో హానర్ మ్యాజిక్ 6 ప్రోను భారత్ లో లాంచ్ చేసింది. ఒప్పో లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ గురించి తెలుసుకోండి.

హానర్ తన లేటెస్ట్ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ మ్యాజిక్ 6 ప్రోను భారత్​లో లాంచ్ చేసింది. ఈ ఏడాది జనవరిలో చైనాలో లాంచ్​ అయిన హానర్ మ్యాజిక్ 6 ప్రో ఇప్పుడు అనేక ముఖ్యమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఆడియో, బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే, సెల్ఫీ సామర్థ్యాలకు గాను 5 2024 గోల్డ్ లేబుల్స్​ని దక్కించుకున్న ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హానర్ మ్యాజిక్ 6 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్​ఫోన్​లో 6.8 ఇంచ్​ క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ ఫుల్​ హెచ్​డీచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 8 జెన్ 3 4ఎన్ఎం మొబైల్ ప్లాట్​ఫామ్, అడ్రినో 750 జీపీయూతో పనిచేస్తుంది. 12 జీబీ వరకు ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14పై మ్యాజిక్యూఐ 8.0తో పనిచేస్తుంది. 80వాట్ వైర్డ్, 66వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సామర్థ్యం కలిగిన 5,600 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

కెమెరా సెటప్​లో 50 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ ఓవీహెచ్​9000 ప్రధాన సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్​తో 180 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇది 4కే వీడియో రికార్డింగ్​ను సపోర్ట్ చేస్తుంది. ఎల్​ఈడీ ఫ్లాష్​ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫేషియల్ రికగ్నిషన్ కోసం 3డీ డెప్త్ కెమెరాను అందించారు.

హానర్ మ్యాజిక్ 6 ప్రో వాటర్​ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ కలిగి ఉంది. 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయెల్ 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

హానర్ మ్యాజిక్ 6 ప్రో: ధర..

హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్​ఫోన్​ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.89,999గా ఉంది. 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్​ఫోన్ ఆగస్టు 15 నుంచి Amazon.in, ఇతర రిటైల్ అవుట్లెట్లలో విక్రయించనుంది. హానర్ మ్యాజిక్ 6 ప్రో ధర వచ్చే 180 రోజుల పాటు స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత మారే అవకాశం ఉంది.
ఈ వారం లాంచ్​ అయిన టాప్​ స్మార్ట్​ఫోన్స్​..

స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో ఈ వారం పలు లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​ అయ్యాయి. అవి..

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్: కార్ల్ పీ మద్దతు ఉన్న స్మార్ట్​ఫోన్ బ్రాండ్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ వేరియంట్​ను ప్రకటించింది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కొన్ని అప్​గ్రేడెడ్ స్పెసిఫికేషన్లు, డ్యూయల్-టోన్ బ్యాక్ ప్యానెల్​తో వస్తుంది, డిజైన్​ ఆకట్టుకునేలా చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో ప్రాసెసర్​పై పనిచేసే ఈ స్మార్ట్​ఫోన్ వినియోగదారులకు మెరుగైన గేమింగ్, పనితీరు అనుభవాన్ని అందిస్తుంది.

రియల్​మీ 13 ప్రో సిరీస్: రియల్​మీ కొత్త కెమెరా, పెర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్​ఫోన్​ సిరీస్. ఇందులో రియల్​మీ 13 ప్రో, రియల్​మీ 13 ప్రో ప్లస్ అనే రెండు మోడళ్లు ఉన్నాయి, ఇవి స్నాప్​డ్రాగన్ 7ఎస్ జెన్ 2 5 జీ ప్రాసెసర్​తో పనిచేస్తాయి. అధునాతన కెమెరా సామర్థ్యాలు, ఏఐ ప్యూర్ బోకే, ఏఐ నేచురల్ స్కిన్ టోన్, ఏఐ అల్ట్రా క్లారిటీ, ఏఐ గ్రూప్ ఫోటో వంటి విస్తృత శ్రేణి ఏఐ ఫీచర్లను అందించే కొత్త హైపర్ ఇమేజ్+ ఆర్కిటెక్చర్​తో ఈ స్మార్ట్​ఫోన్ ​వస్తుంది.