కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో సూపర్ హిట్ అయ్యింది ‘డిమోంటి కాలనీ 2’. ఆగస్ట్ 15న థియేటర్లలో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ కు పాజిటివ్ టాక్ వచ్చింది.
ఇక ఇదే చిత్రాన్ని తెలుగులో ఆగస్ట్ 23న విడుదలై చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు కలెక్షన్స్ పరంగానూ హిట్టయ్యింది. గతంలో 2015లో సూపర్ హిట్ అయిన డిమెంటి కాలనీ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించడంతో విడుదలకు ముందే ఈ పై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ముఖ్యంగా హారర్ మూవీ లవర్స్ ఈ కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేశారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ లో అరుళ్ నిథి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అర్చన్ రవీంద్రన్, అంటి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ కు సామ్ సీఎస్ సంగీతం అందించారు. దాదాపు రూ.15 కోట్లతో నిర్మించిన ఈ మూవీ మొత్తం రూ.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇటు తెలుగులోనూ ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది.
థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిమెంటి కాలనీ 2 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఇదేనంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నారట. ఈ విషయాన్ని సెప్టెంబర్ 16న ప్రకటించింది జీ5. తమిళంతోపాటు తెలుగులోనూ అందుబాటులోకి తీసుకురానున్నారట. “చీకటి మళ్లీ వస్తోంది.. ప్రతీకారం కోసం వేచి ఉంది. జీ5లో సెప్టెంబర్ 27 నుంచి తమిళం, తెలుగులో డీమెంటి కాలనీ 2 స్ట్రీమింగ్ అవుతుంది” అంటూ రాసుకొచ్చింది.
కథ విషయానికి వస్తే..
క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది డెబీ (ప్రియ భవానీ శంకర్). అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ అంతలోనే సామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో తన భర్త సూసైడ్ చేసుకోవడానికి గల కారణం తెలియక డెబీ సతమతమవుతుంది. ఓ బౌద్ధ సన్యాసి (త్సెరింగ్ దోర్జీ) సాయంతో తన భర్త ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే సామ్ సూసైడ్ చేసుకోవడానికి గల రీజన్ తెలుస్తోంది. సామ్ చదివిన ఓ పుస్తకమే అతడి చావుకు కారణమని.. అంతకుముందు కొందరు అలాగే చనిపోయారని తెలుసుకుంటుంది. ఆ పుస్తకం చదివిన మరికొందరి చావులను చెక్ పెట్టేందుకు తన మామ రిచర్డ్ (అరుణ్ పాండియన్) తోపాటు సోదరుడితో కలిసి ప్రణాళిక రచిస్తుంది. చివరకు డెబీ ప్రయత్నం ఫలించిందా ? అనేది .