వినాయకుడిని ఇంటికి తీసుకువస్తే ఎన్నో రోజులు ఉంచాలి? మట్టి విగ్రహాలు పెడితేనే భక్తులకు గణపయ్య బ్లెస్సింగ్స్ అందుతాయా?
నిమజ్జనంతో మనకి, వినాయకుడికి బంధం తెగిపోతుందా? వంటి అపోహాలు చాలామందిలో ఉంటాయి. అయితే వాస్తవాలు ఏంటి? మీకున్న అపోహలను క్లియర్ చేసే ఫ్యాక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. మీ మైండ్‌ని క్లియర్ చేసే నిజాలు తెలుసుకుని హాయిగా వినాయక చవితిని ఎంజాయ్ చేసేందుకు ఇవి హెల్ప్ అవుతాయి.
నిమజ్జనం ఎప్పుడు చేయాలి?
Myth : వినాయకుడి విగ్రహాన్ని 10 రోజులు ఉంచగలిగితేనే తీసుకురావాలి!!??
Fact : వినాయకుడి విగ్రహాన్ని చాలామంది 10 రోజులు ఉంచాలేమో అనుకుంటారు. కానీ గణనాథుడిని 1.5, 3,5, 7 లేదా 10 రోజుల్లో నిమజ్జనం చేయవచ్చు. పదిరోజులు కచ్చితంగా ఆగాలన్నా రూల్ లేదు. మీ కంఫర్ట్, కుటుంబ విధానాలు బట్టి స్వామి వారిని ఇంట్లో ఉంచుకోవచ్చు. అనంతరం నిమజ్జనం చేయాలి. అలాగే కొందరు 9, 12 రోజుల్లో కూడా నిమజ్జనం చేస్తారు.
మట్టి విగ్రహాలే ఎందుకు?
Myth : పండక్కి కేవలం మట్టి విగ్రహాలే పెట్టాలా?
Fact : మట్టి విగ్రహాలు ఎకో ఫ్రెండ్లీ. వినాయకుడిని మళ్లీ నిమజ్జనం చేస్తాము కాబట్టి మట్టి వినాయకుడిని ఎంచుకుంటే మంచిదని చెప్తారు. అయితే నిజమైన భక్తితో పూజిస్తే.. ఎలాంటిదానితో విగ్రహం చేశారనేది పెద్ద మ్యాటర్ కాదు.
మోదకాలు కేవలం ప్రసాదమేనా?
Myth : మోదకాలు కేవలం స్వీట్‌గా చేసి వినాయకుడికి పెట్టే ప్రసాదమేనా?
Fact : మోదకాలు కేవలం ప్రసాదంగా పెట్టేందుకు చేసే స్వీట్ కాదు. ఇవి వినాయకుడికి ఇష్టమైన ఫుడ్‌గా చెప్తారు. ఇవి వివేకం, సంతోషం, సమృద్ధిని సూచిస్తాయని భక్తులు భావిస్తారు.
నిమజ్జనంతో బంధం తెగిపోతుందా?
Myth : నిమజ్జనం చేస్తే గణపతితో బంధం తెగిపోయినట్టేనా?
Fact : నిమజ్జనం చేసి వినాయకుడిని పంపించేస్తే అక్కడితో బంధం తెగిపోతుందా అంటే కాదు. ఈ ప్రక్రియ పుట్టుక, పునర్జన్మని సూచిస్తుంది. వినాయకుడు ప్రతి సంవత్సరం తిరిగి వస్తాడనే నమ్మకాన్ని ప్రజలకు ఇస్తుంది. అందుకే ఇన్నాళ్లు ఎలా ఉన్నా.. ఈ పదిరోజులు చాలామంది సంతోషంగా గడుపుతారని చెప్తారు.
మహారాష్ట్ర వాళ్లే చేసుకోవాలా?
Myth : వినాయక చవితి కేవలం మహారాష్ట్రవాళ్లకేనా?
Fact : ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే.. ఛత్రపతి శివాజీ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రధాన కారణం కాబట్టి అక్కడివారు చాలామంది వినాకుడి పండుగ తమకు మాత్రమేనని అనుకుంటారు. కానీ దేశ వ్యాప్తంగా భక్తులు గణపయ్యను పూజిస్తారు. కొన్ని విదేశాల్లో కూడా వినాయకుడిని భక్తి శ్రద్ధలతో ప్రజలు పూజిస్తారు.
ఈ అపోహలన్నీ పక్కన పెట్టి ఇంటికి వచ్చిన వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజించండి. ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ విధానం ఫాలో అయితే పర్యావరణానికి కూడా మంచిది. అలాగే నిమజ్జనం సమయంలో చాలామంది పూజకు ఉపయోగించిన వస్తువులు కూడా నీటిలో వేస్తారు. ఇది నీటి కాలుష్యాన్ని పెంచుతుంది. కాబట్టి పూజకు వినియోగించిన వస్తువులతో కంపోస్ట్ చేసుకోండి. అలాగే వినాయకుడిని మాత్రమే నీటిలో నిమజ్జనం చేస్తే సరిపోతుందని గుర్తించుకోవాలి.































